ఎప్పుడూ బీజీ బీజీగా రాజకీయ రంగంలో ఉండే ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా అన్నీంటికీ కాస్త విరామమిచ్చి అందరితో కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది..నిజంగా ఆశ్చర్యమే..ఇలాంటి సందర్భంగా ఒకటి నూతన సంవత్సర వేడుకల్లో జరిగింది. మరి ఆ స్టెప్పులేసిన ప్రజా ప్రతినిధి ఎవరా అనుకుంటున్నారా..? ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాహ్యలు చేస్తూ వార్తలో ఉండే సీపీఐ జాతీయ నేత  నారాయణ.

 నూతన సంవత్సరం సందర్బంగా  గ్రేటర్ హైదరాబాద్ విభాగం తరపున హుస్సేన్‌సాగర్‌లోని రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన ఖైరున్సిసా బోట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. తర్వాత అక్కడ రికార్డింగ్ పాట రావడంతో  సీపీఐ నారాయణ  హుషారుగా తోటి నాయకులతో స్టెప్పులేస్తూ..హల్ చల్ చేశారు. ఆయనతో పాటు మరో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి చిరునవ్వులు ఆయన తోటి నాయకులు ఉత్సాహంతో నారాయణతో స్టెప్పులేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: