అందమైన భామను చూస్తే చాలు.. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు పుడుతుందట. అందుకే కామాతురాణాం న భయం.. న లజ్జా అని కూడా అంటారు. మెదడులో కామ కీటకం కుట్టిందంటే ఉచ్చనీచాలు మరుస్తారు చాలా మంది. చివరకు సమాజంలో ఉన్నత స్థానంలో వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు.. ఈ విషయం ఓ ఎంపీ మరోసారి రుజువు చేశాడు. 

ఇంతకీ విషయం ఏమిటంటే.. బ్రిటన్ లో లేబర్ పార్టీకి చెందిన సైమన్ డంజక్ అనే ఓ ఎంపీ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ముఖ్యంగా మహిళల అంశాల్లో యాక్టివ్ గా ఉండేవాడట. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాగా ప్రచారం చేసేవాడట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన వద్దకు ఉద్యోగం కోసం వచ్చిన ఓ ఓ టీనేజర్ ను చూసేసరికి ఆ ఎంపీగారికి కూడా మతిపోయిందట. 

క్రమంగా ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నాడట. అది కాస్తా పెరిగాక అశ్లీలమైన మెస్సేజీలు పంపడం ప్రారంభించాడట. తన మనసులో ఉద్దేశం తెలిస్తే ఆమె సహకరిస్తుందని ఆయన ఎక్స్ పెక్ట్ చేశాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచాడు. ఇలాంటి వ్యవహారాలంటే.. మహా చిరాకు పడే ఆ కుర్రది ఎంపీ గారి బూతు పురాణం చూసి తట్టుకోలేకపోయిందట.   

ఎంపీ అయితే నాకేంటి.. అనుకుంటూ ధైర్యంగా మాంచెస్టర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. పోలీసుల దర్యాప్తులో ఇతగాడి కామ స్వరూపం బయటపడిందట. చివరకు 50 ఏళ్ల ఆ ఎంపీ కూడా తప్పు ఒప్పుకున్నాడట. కాకపోతే.. మెస్సేజీలతోనే ఆగిపోయాను బాబాయ్.. అంతకు మించి నేనేమీ చేయలేదని పోలీసులకు చెప్పుకున్నాడట. ఇది కాస్తా వివాదం కావడంతో చివరకు ఆ టీనేజర్ కు సారీ చెప్పాడట. 

ఈ వివాదానికి మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం లభించేసరికి.. అతని పరువు కాస్తా పోయింది. చివరకు సొంత పార్టీయే అతన్ని సస్పెండ్ చేసింది. ఓ బూతు మెస్సేజీ మొత్తానికి అతని పొలిటికల్ కేరీర్ ను స్పాయిల్ చేసేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: