రాజకీయాల్లో వారసత్వం కొత్తేమీ కాదు.. ప్రజాస్వామ్య యుగంలోనూ ఈ రాజరికపు పోడకలేంటంటూ కొందరు ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తుంటారు. కాకపోతే.. రాజకీయ నాయకుల కొడుకులైనంత మాత్రాన అర్హులను, ఆసక్తి , సామర్థ్యం ఉన్నవారి రాజకీయ హక్కుని ఎలా కాదంటాం.. అందులోనూ వారు ప్రజాస్వామ్యయుతంగానే ఓట్ల ద్వారా ఎన్నికవుతున్నప్పుడు రాజరికం ఎలా అవుతుందంటారు మరికొందరు.

ఏదైమైనా.. ప్రజాస్వామ్యంలో జనం మెచ్చేవారే నాయకులు.. వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉండాల్సిందే. ప్రస్తుతం  తెలుగు రాజకీయ నేతల వారసుల టాలెంట్ పైనా జోరుగా చర్చ సాగుతోంది. చంద్రబాబు కుమారుడు లోకేశ్, కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. వైఎస్సార్ కుమారుడు జగన్... తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 

వీరిలో ప్రస్తుతం కేటీఆర్ వీరి ముగ్గురులోనూ దూకుడుగా వెళ్తూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఐటీ మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. మంచి వాగ్దాటి పనితీరు కలిగిన కేటీఆర్ క్రమంగా కేసీఆర్ వారసుడుగా ఎదుగుతున్నారన్న అభిప్రాయం నెలకొంటోంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసంకేటీఆర్ కృషి చేస్తున్నారు.. అందులో విజయం సాధిస్తే ఆయన సీఎం కుర్చీకి మరింత దగ్గరవుతారు. 

ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నది వైఎస్సార్ పుత్రుడు జగన్. గత ఎన్నికల వరకూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జగన్.. వ్యూహాత్మక తప్పిదాల కారణంగా కాస్త వెలుగు తగ్గారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను తన అనుకూలతలుగా మార్చుకోవడంలో జగన్ విఫలమవుతున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అధికార పార్టీ వల నుంచి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో మాత్రం జగన్ సక్సస్ అయ్యారు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆంధ్రా సీఎం అవకాశాలు ఉన్నాయి. 

ఇక ఈ ముగ్గురిలోనూ మూడో ప్లేస్ లో కొనసాగుతున్నారు లోకేశ్.. తండ్రి నుంచి వచ్చిన వారసత్వపార్టీ పదవులే తప్ప ఇంతవరకూ ఆయన జనం ఓట్లతో గెలవలేదు. అంతే కాదు.. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో అనుకున్నంత చురుగ్గా ఉండలేకపోతున్నారు. తెరవెనుక పాత్ర పోషిస్తున్నా.. తన ముద్రను చూపించలేకపోతున్నారు. చివరకు తన మిత్రుడు అభీష్టను కాపాడుకోవడంలోనూ లోకేశ్ తాజా విఫలమయ్యారు. తన పనితీరును సమీక్షించుకోకపోతే.. లోకేశ్ భవిష్యత్ అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: