ప్రపంచంలో మనిషిని సృష్టించింది భగవంతుడు అని నమ్ముతాం..తర్వాత మనిషికి ఏమైనా అయితే బతికించే వారే వైద్యలు..అందుకే వైద్యోనారాయణ హరి అంటారు. వైద్యున్ని మనం దేవుడితో సమానంగా చూస్తాం..అలాంటి స్థానంలో ఉన్నఓ వైద్యుడు పెషెంట్ ని చావబాదాడు. కేవలం ఒక నర్సును తాకినందుకు కోపంతో పేషెంటుని చితక బాదాడు. పొరబాటున తాకాడో ఏమోగానీ నర్సును అతడు తాకాడట. ఆ విషయాన్ని ఓ డాక్టరుతో నర్సు చెప్పింది. అంతే... కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోతూ వైద్యుడు రోగి ఉన్న గదికి వచ్చాడు.

వైద్యుడు.. ఎవడు నిన్ను తాకింది అని అడగ్గా... నర్సు తన వేలిని ఓ రోగి వైపు చూపించింది. అంతే... వెంటనే ఆ రోగిని కిందికి ఈడ్చి చేతులతో ముష్టిఘాతాలు వేయడం మొదలుపెట్టాడు. మధ్యలో రోగికి సంబంధించిన ఓ వ్యక్తి అడ్డుకునేందుకు రాగా... అతడిని బండబూతులు తిట్టాడు. రష్యాలోని బెల్గొగ్రాడ్ నగరంలోని ఆస్పత్రిలో ఓ షేషంట్ నర్సును తాకాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆస్పత్రి డాక్టర్ ఇల్యా జెలన్‌డినోవ్ నా నర్సును తాకుతావా అంటూ ఆ రోగిని పిడిగుద్దులతో చితకబాది చంపేశాడు.

గత డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిందంతా సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. పుటేజీని పరిశీలించిన ప్రభుత్వం వైద్యుడిని సస్పెండ్ చేస్తూ కేసు నమోదుచేసింది. సీసీటీవీ పుటేజీని ఒక్క రోజులోనే 7లక్షల మంది వీక్షించడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: