సాధారణంగా రైలు ప్రయాణాలంటే విపరీతమైన జనసందోహం కలిగి ఉంటారు. సామాన్యలు దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు ఈ రైళ్లలలో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు అనేది పేదవారికి వరం లాంటింది. తాజగా ఓ దేశంలో మాత్రం ఒక్కరి కోసం ఏకంగా రెండు పూటల అక్కడ నుంచి రైలు సర్వీసు కొనసాగుతుందట.. వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో చిన్న దేశమైనా అత్యున్న సాంకేతిక విజ్ఞానంగా పేరు పొందిన జపాన్ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సాంకేతిక విప్లవంలో జపాన్ మించిన దేశం లేదంటే ఆశ్చర్యం లేదు. చిన్న దేశమైనా ప్రపంచంలో అతి గొప్ప స్థానాన్ని అలంకరించిన జపాన్ తమ దేశ ప్రజల విషయంలో బాధ్యతగా నడుచుకుంటుంది. జపాన్ లోని కామి-షిరాతకి ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణికులు లేక అటువైపు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అయితే ఒక్క రైలు మాత్రం రెండూ పూటలా సర్వీస్ కంటిన్యూ చేస్తూ వచ్చింది.

ఉదయం, సాయంత్రం ఒక్క ప్యాసింజర్ కోసం వస్తున్న రైలు


ఉదయం ఓ సారి, సాయంత్రం ఓ సారి నడుపుతోంది. ఒకే ఒక్క ప్రయాణికురాలు, స్కూల్ కు వెళ్లే పాప ఆ స్టేషన్లో రైలెక్కుతుంది. అన్ని రైళ్ల ను రద్దుచేసిన జపాన్ ప్రభుత్వం మాత్రం ఆ పాప రెండు పూటలా స్కూల్ వెళ్లేందుకు రైలు నడపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పాప ఏంచక్కా ఎలాంటి ఆందోళన లేకుండా విద్యాబుద్ధులు నేర్చుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: