వాస్త‌వానికి చంద్ర‌బాబు కు ఉన్నంతగా రాజకీయ అనుభ‌వం దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ నాయ‌కులు లేర‌నే చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయ చాతుర్యం ఇప్పుడు అట‌కెక్కిందో లేక కావాల‌ని చేస్తున్నారో తెలియదు గానీ.. ఆయ‌న పాడిన‌ పాటే పాడుతూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం లో భాగంగా బీజేపీ తో పొత్తు పెట్టుకుని యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలో గ‌త రెండు రోజుల క్రితం నిజాం కాలేజీ గ్రౌండ్ లో భారీ బ‌హిరంగ స‌భ‌కు పెట్టి తెలుగు తమ్ముళ్ల కు మంచి బూస్ట్ ఇచ్చార‌ని చెప్పాలి. కానీ ఆయ‌న వ్యాఖ్య‌లు మాత్రం గ‌తంలో లాగానే యాదావిధిగానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు.  రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం కొత్త‌గా ఎర్పడ్డ న‌వ్యాంధ్ర సీఎం గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు గ‌తంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించిన అనంత‌రం హైద‌రాబాద్ వేదికగా ఏర్పాటు స‌భ అనంత‌రం ఆయ‌న రెండోసారి నిజాం కాలేజీ మైధానంలో మాట్లాడిన తీరులో ఏ మాత్రం మార్పులేద‌ని చెప్ప‌క తప్ప‌దు. ఆయ‌న మాట్లాడిన తీరును ఒక్క‌సారి గ‌మ‌నిస్తే...


నేను ఎక్క‌డికీ పోలేదు. మీతోనే ఉంటాను


నేను ఎక్క‌డికీ పోలేదు. మీతోనే ఉంటాను. మీ వెంటే ఉంటాను. నేను ఇక్క‌డ తిర‌గ‌డం లేద‌ని కొందరు అంటున్నారు.  ముఖ్య‌మంత్రి గా నాకు ఉన్న భాద్య‌త‌లు, కొత్త‌గా ఏర్ప‌డ్డ రాష్ట్రాన్ని నిల‌దొక్కుకోవ‌డానికి చేయాల్సిన విధుల వ‌ల్ల నేను మీకు అందుబాటులో ఉండ‌లేక‌పోతున్నాను. ఎక్క‌డ ఉన్నా న‌డిపించేది నేనే. అని వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు. అంతేకాకుండా న‌గ‌ర ప్ర‌జ‌లు, టీడీపీ శ్రేణుల‌కు భ‌రోసా నిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. వారికి ఏలాంటి స‌హ‌య స‌హ‌కాలు అందిస్తున్నారో క్లారిటీ ఇవ్వ‌డం మాత్రం మ‌రిచారు. ఇక‌పోతే హైద‌రాబాద్ అభివృద్ధి మాత్రం తాను సీఎం గా ఉన్న‌ప్పుడే జ‌రిగింద‌ని తెలప‌డం మాత్రం మర‌వ‌లేదు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి దృష్టి లో  ఉంచుకుని దేశంలో అన్ని ప్రాంతాల వారిని ఇక్క‌డ‌కు ఆహ్వానించాన‌ని, ఇప్పుడు వారికి ఏదైనా క‌ష్టం వ‌స్తే ఊరుకోబోన‌ని సెల‌విచ్చారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. పెట్టుబ‌డుల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు గ‌తంలో చేసిన విధంగానే ఉన్నాయి. 


హైద‌రాబాద్ కు పెట్టుబ‌డుల కోసం దేశంలో ని అన్ని ప్రాంతాల వారిని ఇక్క‌డ‌కు ఆహ్వానించి వారితో పెట్టుబ‌డులు పెట్టించాను. ప్ర‌పంచం అంతా తిరిగి కంపెనీల‌ను తీసుకువచ్చి కార్యాల‌యాలు పెట్టుకోనే ఏర్పాటు చేశాను. ఇక్క‌డ ఏ క‌ష్టం వ‌చ్చినా టీడీపీ, బీజేపీ లు అండ‌గా ఉంటాయి. మా పై విశ్వాసం ఉంచండి. అన్నారు. అంతేకాదు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ టీడీపీ, బీజేపీ గెలుపున‌కు ఈ గ్రేట‌ర్ ఎన్నిక‌ల నాంది కావాల‌ని సూచించారు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉంది. ప్ర‌తి కార్య‌కర్త ఓ సైనికుడిగా పనిచేయాల‌ని... హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి తెలుగు దేశం ఆయాంలోనే జ‌రిగింద‌ని తెలుపుతూ ప్ర‌చారం చేయాలని తెలిపారు. ఇక్క‌డే ఉంది ఓ ట్వీస్ట్. ఆయ‌న ఇప్ప‌టికి తెలుగుదేశం పార్టీనాయుక‌లు, బీజేపీ నాయకులు ఉన్నారు. వారు మీకు క‌ష్టం వస్తే అండ‌గా ఉంటారని తెలిపారు. కానీ నేను ఉన్నాను మీకు క‌ష్టం వ‌స్తే అండ‌గా ఉంటానన్న విష‌యంలో పూర్తి గా విస్మ‌రించారు. అంటే ఆయ‌న ఇక తెలంగాణ ప్రాంత‌పు రాజ‌కీయాల్లో దాదాపుగా దూరంగా ఉంటాన‌నే సంకేతాలు ఇచ్చారు.


ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన గ్రేట‌ర్ ఓట‌ర్ తెలుగు దేశం కూట‌మికి ఏ న‌మ్మ‌కంతో ఓటు వేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక‌పోతే తెలంగాణ కు చెందిన టీడీపీ నాయ‌కుల‌ను న‌మ్ముకుని ఓట్లు వేద్దామా అంటే.. టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబు మాట‌కు గిరి దాట‌ని ప‌రిస్థితి. తెలంగాణ లో పార్టీ త‌ర‌పును ఏదైనా కార్య‌క్ర‌మాలు చేయాలంటే ఆంధ్ర ప్ర‌దేశ్ తాత్క‌లిక రాజ‌ధాని విజ‌య‌వాడకు వెళ్లి నాయకుడిని క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి.  ఆయ‌న మాట‌ల‌ను తూచా త‌ప్పుకుండా , ఎదురు చెప్ప‌కుండా చేయాల్సిందే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యాఖ్యల‌ను ఏలాంటి స్పంద‌న వ‌స్తుందని గ‌న‌క గ‌మ‌నిస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. అంతేకాదు 2019 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసిన ఏపీ సీఎం వ్యాఖ్య‌ల తీరు ఇంతేనా అని పలువురు రాజ‌కీయ మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే రెండు క‌ళ్ల సిద్ధాంతం గురించి చంద్ర‌బాబు చెప్పిన వ్యాఖ్య‌లు దాదాపుగా 4 ఏళ్ల నుంచి వింటున్నారు తెలుగు ప్ర‌జ‌లు. ఆయ‌న ఆ సిద్దాంతం ద్వారా ఏ ప్రాంతానికి న్యాయం చేశారో గ‌మ‌నిస్తే ఏమీ ఉండ‌దు. విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌జ‌ల ముందుకు  తీసుకు వ‌చ్చిన చంద్ర‌బాబు తాజాగా మ‌రోసారి ఆ బాంబు ను వ‌దిలారు. 


గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఉన్న సెటిల‌ర్ల గురించి ఒక్క సారి ఆలోచిస్తే.. ఏపీ సీఎం గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు తన పాల‌న‌ను ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి ఆంధ్ర త‌ర‌లించారు. ఇక‌ గ‌త 20 సంవత్సరాల నుంచి హైద‌రాబాద్ లో ఉంటూ ప‌నిచేస్తున్న సీమాంద్ర ఉద్యోగుల‌ను మ‌రో మూడు నెల్ల‌లో హైద‌రాబాద్ ను వ‌దిలి ర‌మ్మ‌న్నారు ఏపీ సీఎం. ఇంత‌వర‌కు భాగానే ఉన్నా పాల‌న ప‌ర‌మైన వ‌సతుల గురించి మ‌రిచిన సీఎం ఉద్యోగుల పై ప‌డ‌టం పై తీవ్ర స్థాయి మండిప‌డుతున్నారు ఏపీ ఉద్యోగులు. ఇప్ప‌టికీ ఏపీలో సెక్రటేరియ‌ట్ గానీ.. పాల‌నకు అవ‌స‌ర‌మ‌య్యే భ‌వనాలు గానీ లేవు. ఈ క్ర‌మంలో ఉద్యోగులు ఎక్క‌డి నుంచి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలో తెలిపాల‌ని భీస్మించుకొని కూర్చున్నారు. తాజాగా హైద‌రాబాద్ లో ఉన్న సీమాంద్ర ఉద్యోగులు గ్రేట‌ర్ లో ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర బాబు తీరు పై అసంతృప్తి తో ఉన్న ఉద్యోగులు ఏలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అర్ధం కానీ ప‌రిస్థితి. ఒక్క‌టి మాత్రం వాస్తవం...  గడిచిన  18 నెల‌ల్లో చంద్రబాబు అటు ఏపీకి ఇటు తెలంగాణ‌కి చేసింది ఏమీ లేద‌న్న‌ది. 


ఇక్క‌డ మ‌రో చెప్పుకునే విష‌య‌మేమిటంటే.. సుమారుగా 45 నిమిషాల్లో పాటు ప్ర‌సంగించిన చంద్ర‌బాబు అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేయ‌లేక పోయారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీయైన టీడీపీ అధికార పార్టీ పై బ‌ల‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డంలో దాదాపుగా విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్నారు. ఇక‌పోతే ఈ మ‌ధ్య కాలంలో ఇద్ద‌రు చంద్రుల క‌లయిక వ‌రుస‌గా చోటు చేసుకుంటున్నాయి. రెండు నెల్ల‌లోనే వీరి క‌ల‌యిక మూడు సార్లు జ‌రిగింది.  కేసీఆర్ చేసే అభివృద్ధి ప‌థ‌కాల్లో దూసుకుపోతుంటే.. చంద్ర‌బాబు మాత్రం ప్ర‌తి ప‌క్షం నాయకుడిగా క‌నీస  ప్ర‌య‌త్నాలు లేవు. అంటే దాదాపుగా చంద్ర‌బాబు ఇటు గ్రేట‌ర్ ప్ర‌జ‌ల‌కు, సీమాంధ్రులు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా చేసింది... అంతేకాకుండా రాబోవు రోజుల్లో కొత్త‌గా  అభివృద్ధి గానీ... ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విష‌యంలో గానీ భ‌రోసా ఇవ్వ‌లేక పోయార‌నే చెప్పొచ్చు. ఇక‌పోతే గ్రేట‌ర్ లో ఉన్న సెటిల‌ర్ల‌ను త‌మ వైపు తీప్పుకునే ప్ర‌య‌త్న విఫ‌ల‌మ‌య్యారు. తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలకు దాదాపుగా దూరంగా ఉంటూ వ‌స్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం ఈసారి కొత్త‌గా ఏమీ చెప్పింది లేద‌న్న‌ది అవ‌గ‌త‌మౌతుంది. మ‌రీ గ్రేట‌ర్ వాసులు ఎలా రిసీవ్ చేసుకోనున్నారో మ‌రి కొన్ని రోజులు వేచి చూస్తే గానీ తెలియ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: