ఈ మద్య ఈవ్ టీజింగ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద భూతంలా తయారైంది. అమాకమై స్టూడెంట్స్ పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి టీజింగ్ వల్ల ఎందరో విద్యార్థులు తమ నిండు జీవితాలు కూడా బలితీసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా చైనాలో ఓ బాలికను టీనేజర్ అమ్మాయిలు అతి కృరంగా విచక్షణారహితంగా బట్టలు విప్పించి కొట్టారు. 

చైనాలో హయినన్ ప్రావిన్స్లోని లింగావో ప్రాంతంలో పదిహేనేళ్ల అమ్మాయిని కొంత మంది టీనేజర్స్ విపరీతంగా కొట్టడమే కాకుండా బండ బూతులు తిడుతూ.. రోడ్డుపై పడేసి జట్టు పట్టుకుని లాగుతూ.. కాళ్లతో తన్నుతూ అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి మరీ చితక్కొట్టారు.ఈ సంఘటనతో చైనాలో టీనేజ్ గ్రూపుల ఆకృత్యాలు మరో సారి బయటకు వచ్చినట్టయింది. వారి బారి నుంచి తప్పించుకోవడాని ఆ బాలిక ప్రయత్నించానా వారు వెంబడించి మరీ కొట్టారు.

ఈ సంఘటన జరుగుతున్న సమయంలో కొందరు బాలికలు అక్కడే ఉన్నా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ ఘోరాన్ని వీడియో తీసి  ఇంటర్నెట్ లో పెట్టారు. దీంతో ప్రస్తుతం చైనాలో టీనేజర్ ల ఆగడాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏ కారణం చేత విద్యార్థినిని కోట్టారనే దానిపై విచారణ ప్రారంభించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: