ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వాడకంపై భారీ ఎత్తున్న కేసులు నమోదైయ్యాయి..దీంతో వాహనదారులు కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. ఫైన్ తో సరిపోయేది పోయి కొన్ని సార్లు కేసులు నమోదు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది అంతే కాదు ద్విచక్ర వాహనదారులపై కేసులు పెట్టించి, వారిని కోర్టుల చుట్టూ తిప్పడం సరైనా పద్దతి కాదని హైకోర్టు తెలిపింది.

ప్రమాదాలు జరుగాకుండా చూడాలన్నదే తమ అభిమతమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వాడకం సరిగా లేదని నియమనిబంధనలు ఎంత మంది పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా వాహనదారులు రోడ్డుపైకి వచ్చి పట్టు బడితే..వారిపై కేసులు నమోదు చేయడం కంటే వారికి హెల్మెట్ పెట్టిస్తే సరిపోతుంది అంతే కాదు హెల్మెట్ వల్ల లాభాలు పెట్టుకోకపోతే జరిగే నష్టాలు అర్ధమయ్యేలా చెబితే చాలా మంచింది అని సలహా ఇచ్చింది.

హెల్మెట్ పెట్టుకోని వాహనదారున్ని ఆపుతున్న పోలీస్


రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహన దారులకు సాద్యమైనంత వరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అభిప్రాయ పడింది.  రెండు వారాల్లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదిలా ఉండగా, హెల్మెట్లు ధరించడంపై కోర్టులో 2010 నుంచి కేసు నలుగుతున్న విషయం అందరికి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: