అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగాయి. 30గంటలకుగా ఢిల్లీలో భైటాయించిన ఆందోళనకారులను అక్కడి నుండి  పంపించడానికి పోలీసులు పలుమార్లు లాఠీచార్జ్ లకు దిగారు. అయినా లెక్కచేయని ఆందోళనకారులు రాష్టపతి భవన్ వైపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్ల్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పోలీసు చర్యతో విద్యార్దులు రెచ్చిపోయారు పోలీసులపై రాళ్లురువ్వారు. అటు జంతర్ మంతర్ దగ్గర బాబా రామ్ దెవ్, మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ ఆధ్వర్యంలో వేలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో ఢిల్లీ జనసంద్రమయ్యింది. రాజ్ పత్ , విజయ్ చౌక్ జంతర్ మంతర్ ప్రాంతాలు ఆందోళనకారులతో కిక్కిరిసిపోయాయి. ఒక్కసారి ఇంత పెద్దసంఖ్యలో జనం ఢిల్లీకి చేరుకోవడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఎనిమిది మెట్రో స్టేషన్లు తదుపరి ఉత్తర్వులువచ్చేవరకు మూసివేయాలని జిల్లా పోలీసులు మెట్రో రైల్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అటు జిల్లా యంత్రాంగం ఢిల్లీ నగరంలో నిషేధాజ్ఞలు జారీచేసింది. మరోవైపు విద్యార్థులు, యువతను శాంతపరిచేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారింభించారు. కేంద్ర హోమంత్రితో ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ సమావేశమై చర్చలు జరిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: