సాధారణంగా అడవిలో ఉండాల్సి చిరుత ఒక్కసారిగా నగరంలోకి వచ్చిందంటే అక్కడ ఎలాంటి ఉత్కంఠత నెలకొంటుందో వేరే చెప్పనవసరం లేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం ఓ చిరుతపులి బెంగళూరులోని ఓ స్కూలుకు వచ్చి గదులన్నీ కలియతిరిగింది. నగరంలోని విబ్జియార్ స్కూల్‌కు చిరుతపులి వచ్చిందని, సెలవు రోజున విద్యార్థులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. సీ కెమెరాలో చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.

వాళ్లు వచ్చి చిరుతను బంధించడానికి విశ్వప్రయత్నం చేశారు.  దీంతో బెదిరిపోయిన చిరుత అక్కడ అంతా కలిగతిరిగింది. ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు మొత్తం తిప్పి తిప్పి అధికారులను ముప్ప తిప్పలు పెట్టింది. అంతే కాదు ఈ సమయంలో దానికి ఎదురుగా వచ్చినవారిని గాయ పరిచింది. వారిలో సంజయ్ గుబ్బి అనే వ్యక్తి కాలు, చెయ్యిని తీవ్రంగా కొరికింది. దీంతో కోపంతో రెచ్చిపోయిన సంజయ్ చిరుత అని కూడా చూడకుండా దాన్ని కుక్కను కొట్టినట్లు కొట్టబోయాడు. దెబ్బకు బెదిరిపోయిన చిరుత పారిపోయింది.

స్కూల్లో  తిరుగుతున్న చిరుత


అయితే ఆ చిరుతను సమీపం నుంచి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై అది దాడి చేసిందని అన్నారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలోని స్విమ్మింగ్‌పూల్‌కు సమీపంలోని ఓ గదిలో దానిని బంధించామని చెప్పారు. గత ఏడాది జూలైలో చిక్‌మగళూరులోని టీఎంఎస్ స్కూల్‌కు కూడా ఇలాగే ఓ చిరుత వచ్చి ముగ్గురిని గాయపరిచింది. ఈ సంఘటన బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని విబ్‌జియార్ పాఠశాలలో జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: