2009 లాగా కాదు ఇప్పుడు తెలంగాణా లో పరిస్థితి, తీవ్రంగా ఎవరూ ఊహించనంతగా మారిపోయింది .అధికార పార్టీకి తప్ప తెలంగాణా లో ఇతర పార్టీలకి ఎక్కడా పొరపాటన కూడా డిపాజిట్ లు దక్కే పరిస్థితి కనపడ్డం లేదు. తాజాగా జరిగిన గ్రేటర్ హైదరాబద ఎన్నికలే దీనికి పత్యక్ష ఉదాహరణ, మొన్న వరంగల్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది .

 

 

 

 ఉప ఎన్నిక హడావిడి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో ఊపందుకుంది. నారాయణఖేడ్ ఉప ఎన్నిక విషయంలో హరీష్ రావు అప్పుడే సవాళ్లు విసరడం మొదలు పెట్టారు. ప్రత్యర్దులకి అక్కడ డిపాజిట్ లు కూడా రావు అని ఆయన కుండ బద్దలు కొడుతున్నారు. అయితే అధికార పార్టీ వరంగల్ , గ్రేటర్ ఎన్నికలల్లో ఏది చెబితే అదే జరిగింది సో అంతా ఎదో తేడాగా కొడుతోంది అంటున్నారు ప్రతిపక్షం వారు. కాంగ్రెస్ కి గ్రేటర్ లో రెండూ, టీడీపీ కి ఒక్క సీట్ రావడం ఎవ్వరూ ఊహించనిది .

 

 

 

అధికార లెక్కల ప్రకారం లేదా ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా కనీసం కాంగ్రెస్ కి పది సీట్లినా రావాలి కానీ లెక్క బాగా తప్పుతోంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్ధి మీడియా ముందుకి వచ్చి మరీ ఈవీఎం లని ట్యాంపర్ చేస్తున్నారు అంటూ ఆరోపించడం పెద్ద విశేషంగా కనిపిస్తోంది. ఒక పోలింగ్ బూత్ లో తన కుటుంబ సభ్యులూ, బంధువులు మొత్తం కలిపి వందకి పైగా ఓట్లు ఉంటె తనకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి అనీ ఇదెక్కడి చోద్యం అనీ అంటున్నారు ఆయన.

 

 

 

బీజేపీ నేతలు ఒక ఓటింగ్ బూత్ లో ఐదొందల ఓట్లు పోలింగ్ జరగగా 900 ఓట్లు వచ్చాయి అని ఆరోపిస్తున్నారు. దీని మీద అధికార పక్షం ఇంకా స్పందించకపోవడం విశేషం. టెక్నాలజీ మాయం లో రాజకీయంగా ప్రత్యర్దులని దెబ్బ తీయడం కుదరదు అంటూ ఎన్నికల కమీషన్ చెబుతున్నా ఆ మెషీన్ ని ఈజీగా తప్పు పట్టించచ్చు, హ్యాక్ చెయ్యచ్చు  అంటూ నిపుణులు మీడియా తో చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: