పవన్ కళ్యాణ్ మీదా ఆయన ఫాన్స్ మీద ఇంత ఎత్తున లేవడం రాం గోపాల్ వర్మ కి బాగానే అలవాటు. పవన్ కళ్యాణ్ నీ , అతని చర్యలనీ తూర్పారబెట్టడం లో రామూ కి ఎవరూ సాటి లేరు అని చెప్పాలి. మొన్న కాపు రిజర్వేషన్ ల సమయం లో బయటకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు పార్టీ పెట్టిన తరవాత చాలా కొద్దిసార్లు మాత్రమే పవన్ బయటకి రావడం జరిగింది.

 

 

 

 మొన్న మాట్లాడినప్పుడు కూడా పవన్ ఏం మాట్లాడాడో కూడా తనకి అర్ధం కాలేదు అనీ కనీసం పవన్ కళ్యాణ్ కైనా అర్ధం అయ్యిందా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు రామూ. పవన్ జనసేన లాంచింగ్ అప్పుడు ఇచ్చిన  స్పీచ్ తరవాత అతని ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది అనీ అయితే అది తన అభిప్రాయం అనీ అందరి అభిప్రాయాలూ తనకి తెలుసుకోవాలని ఉంది అనీ ఒక పోల్ పెట్టారు రామూ.

 

 

 జనసేన మెయిన్ స్పీచ్ తరవాత పవన్ పయనం ఎలా ఉంది ? సంతృప్తికరంగా ఉందా ? లేదా ? అంటూ 'yes' ఆర్ 'no' ఆప్షన్ లు ఇచ్చాడు వర్మ. ఇప్పటికే ఆయన ట్వీట్ చేసిన ఏడు గంటల్లో no మీద డబ్భై శాతం పైగా జనాలు ఓట్లు గుద్దేశారు. మిగిలిన వారు మాత్రం అతని మీదనే ఇంకా ఆశలు పెట్టుకున్నాం అంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: