చట్టం ముందు అందరూ సమానమే..చట్టానికి చుట్టాలు ఉండరు. నేరస్తుల విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఇలాంటి డైలాగులు మనం ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాం. వాస్తవానికి చట్టం ముందు అందరూ సమానమే నేరం చేసిన వాళ్లు చట్టం ముందు తల దించాల్సిందే. అయితే అప్పుడప్పుడు ఈ చట్టం కాస్త ముందుకు అడుగు వేసి జంతువలపై కూడా తమ ప్రతాప్పాని చూపిస్తుంది. తాజాగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ లో ఓ విచిత్రం జరిగింది. పోలీసులు నేరం చేసిందని ఓ మేకను అరెస్టు చేయడమే కాకుండ దాని యజమానిని కూడా కటకటాల వెనక్కు పంపారు.

వివరాల్లోకి వెళితే..రాజధాని రాయ్ పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో కొరియా అనే ప్రాంతం ఉంది. అబ్దుల్ హసన్ అనే వ్యక్తికి చెందిన మేకపై జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటమాలి ఫిర్యాదు చేశాడు. ఒకసారి వస్తే దాన్ని తరిమేసినా అది మళ్లీ మళ్లీ రావడం దాన్ని యజమాని నియంత్రిచలేక పోవడంతో తోటమాలికి కోపం వచ్చింది..తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని బావించి ఆ మేక, యజమానిపై కేసు పెట్టాడు. తోటమాలి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ వివరించారు.

యజమాని మేకను నియంత్రించలేకపోవడంతో ఇలా జరుగుతుందని తోటమాలి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన మేక మేజిస్ట్రేట్ ఇంటి గోడ దూకి, ఆ ఇంటి గార్డెన్ లోని పూలను, కూరగాయలను చెల్లాచెదురు చేసింది. దీంతో మేకతో సహా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని మేక యజమాని అబ్దుల్ హసన్ తెలిపారు. మేకను..మేక యాజమానిని కోర్టులో హాజరు పర్చనున్నారు. రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నయని ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: