ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ అంటేనే సామాన్యులకు గుండెదడగా ఉంటుంది..ఈ సారి కూడా ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. నిధుల కొరత నేపథ్యంలో ప్రయాణ చార్జీలు పెంచాలని యోచిస్తోంది. రానున్న బడ్జెట్‌లో రైల్వే ప్రయాణికుల చార్జీలను 5 నుంచి 10 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రయాణ, సరుకు రవాణా చార్జీల ద్వారా ఏటా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడం, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు రూ. 32 వేల కోట్ల అదనపు భారం పడిన నేపథ్యంలో ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెపుతున్నాయి.  కేంద్రంలో నిధుల కోరత మరోసారి రైల్వే బడ్జెట్ పై ప్రభావం చూపబోతుంది.

 మరోవైపు ప్రయాణికులు, సరుకు రవాణా నుంచి తగినంత ఆదాయం లేకపోవడంతో చార్జీల పెంపునకే రైల్వే శాఖ మొగ్గు చూపుతున్నదని తెలుస్తున్నది. ప్రయాణికుల టికెట్లతో పాటు సరుకు రవాణా చార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.కేటాయింపులకన్నా తక్కువగా ఖర్చు పెట్టడంతో 2015-16 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రైల్వే శాఖకు కేటాయింపులు 8 వేల కోట్లకు పడిపోయిందని అంటున్నారు.

 ఈ ఏడాది పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగే అవకాశాల్లేవని కూడా అధికారులు పేర్కొంటున్నారు.అయితే ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ప్రయాణ చార్జీలు పెంచే అవకాశం ఉందని రైల్ భవన్‌లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తంగా రైల్వేల ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, చార్జీల పెంపు ఒక్కటే మార్గమని కూడా వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: