నేరస్తులు నేరం చేస్తే వారిని శిక్షించి మంచి దారి చూపించాల్సిన ఓ పోలీస్ అధికారి యూనిఫాం ధరించి విధుల్లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తూ హంగామా చేశాడు..ఇది కాస్తా వైరల్ అయ్యింది. సాధారణంగా సినిమాల్లో పోలీసులు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది..కానీ రియల్ లైఫ్ లో అలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుంది. ఈ మద్య పోలీస్ అధికారులు తమ విధుల్లో వింత వింత పనులు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో నాగిని డ్యాన్స్ చేయిస్తూ ఒకరు, గణతంత్ర దినోత్సవంతో ఐటమ్ సాంగ్ చేయించి మరొకరు ఇలా ప్రజలకు నిబద్దతగా పనిచేయాల్సి వాళ్లే అభాసు పాలయ్యే పనులు చేస్తూ దొరికి పోతున్నారు. తాజాగా తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్న 58 ఏళ్ళ శంకరన్  గత నెలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఆయన యూనిఫాం ధరించి డ్యాన్స్ చేస్తుంటే.. తోటి అధికారులు ప్రోత్సహిస్తూ తమ సెల్ ఫోన్లతో వీడియో తీశారు.

ఇటీవలే ఆ వీడియోను సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్, వాట్సాప్ లలో పెట్టడంతో.. అది కాస్తా వైరల్ లా మారి హల్ చల్ చేయడం మొదలెట్టింది. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో శంకరన్ ను విచారణకు ఆదేశించి, విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తాజాగా శంకరన్ పై సస్పెన్షన్ వేటు పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: