ఏపీని అడ్డగోలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ ను అన్యాయం చేశారు. లోటుబడ్జెట్ తో కొత్త రాష్ట్రం ఇచ్చారు. ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నాం.. ఇవీ మైకు దొరికితే చాలు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే డైలాగులు. మరి అలాంటి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికపరంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. పైసా పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాలి కదా. 

కానీ చంద్రబాబు తీరు చూస్తే మాత్రం అలా జాగ్రత్త పడుతున్నట్టు కనిపించడం లేదు. పైగా ఓ ధనిక రాష్ట్రం తరహాలో అవసరమైనవాటికీ, కాని వాటికీ ఎడాపెడా ఖర్చులు పెడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ దుబారాపై ఓ ప్రముఖ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. దీని ప్రకారం దేశంలోనే అతి ఖరీదైన ముఖ్యమంత్రి అనే విధంగా ఖర్చు చేస్తున్నారట చంద్రబాబు.

ఆయన పీఠం ఎక్కిన దగ్గర నుంచి సగటున నెలకు దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఆఫీస్, విజయవాడలో ఒక క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో విజయవాడ టు హైదరబాద్ తిరుగుతున్నారు. విదేశాలకు సైతం బాగానే వెళ్తున్నారు. మొత్తం మీద ఏడాదికి 30 నుంచి 40 కోట్ల వరకూ ముఖ్యమంత్రి ఖాతాలో ఖర్చు వస్తోందట. 

మొదట్లో కోట్లకు కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ సెక్రటేరియట్ లోని సీఎం ఆఫీసుకు మరమ్మత్తులు చేయించారు. అవి పూర్తయిన తర్వాత ఇంకా హైదరాబాద్ లో ఎందుకు విజయవాడ వెళ్లిపోదాం అన్నారు. పర్యటనల కోసం విచ్చలవిడిగా విమానాలు వాడుతున్నారు. మరి ముఖ్యమంత్రే ఇలా దుబారా చేస్తుంటే ఇక అధికారులు మాత్రం ఏం చేయగలుగుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: