ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధన దిశగా అగుడులు వేస్తోందని దీని కోసం రాబోయే 2016-17 బడ్జెట్ లో అంచనాలకు మించి ప్రణాళికా వ్యయం చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి దార్శనికత ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బడ్జెట్ ముఖ్య ఉద్దేశం. రెండంకెల వృద్ధి సాధనను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశలోనే ప్రతి శాఖతో చర్చిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి. మొత్తం వ్యయంలో ప్రణాళిక కోసం 37శాతం, మూలధన వ్యయం 20శాతం పైగానే ఉంటుంది. జీతాలు, ఫించన్లు, రెండు రాజధానుల కారణంగా ప్రభుత్వ వ్యయం పెరిగినప్పటికినీ ప్రణాళిక వ్యయ అంచనాలను పెంచామని స్పష్టం చేశారు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలను వెల్లబుచ్చింది. అవి ఏంటంటే....


గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 14-15 శాతం పెరిగింది. 2016-17లో ఇది 18శాతం దాకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా రెవెన్యు లోటు ఉన్నప్పటికీ ఉన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. అభివృద్ధికి నిధుల కొరత రానివ్వడం లేదు. ఎప్పటి బల్లులు అప్పుడు చెల్లిస్తున్నాం అని తెలిపింది.


కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద రూ.16వేల కోట్లు రావల్సిఉంటే, గతేడాది రూ. 2300 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ.13700 కోట్లు రావాలి. దీని కోసం ఈ యేడాది ముఖ్యమంత్రి ఐదుసార్లు ప్రధానిని, పదిసార్లు ఆర్ధిక మంత్రిని కలిశారు. మార్చిలోగా మరికొంత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది.


రాజధాని నిర్మాణానికి గత ఏడాది రూ.500 కోట్లు, ఈ ఏడాది రూ.350 కోట్లు ఇచ్చారు. భవనాల నిర్మాణం మొదలుపెడితే అవసరమైన డబ్బు ఇస్తామని తెలిపింది.


పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు రూ.300 కోట్లు ఇచ్చారు. 2014 ఏప్రిల్ నుంచి ఈ నవంబర్ వరకు ఖర్చుపెట్టిన రూ.2766 కోట్లు తిరిగి చెల్లించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని తెలిపింది.


రాష్ట్రానికి ప్రతేయ్క హోదాపై చాలా అపోహలు ఉన్నాయి. సమస్యలన్నింటికీ హోదాయే మందుకాదు. ఈ అంశం కేద్రం పరిశీలనలో ఉంది.


ఈ సంవత్సరం రూ.17800 కోట్లు అప్పు తీసుకోడానికి కేంద్రం అనుమతిస్తే ఇప్పాటి వరకు రూ.14వేల కోట్లు తీసుకున్నాం. దీన్ని మొత్తం ములధనానికే పెట్టాం. ప్రపంచంలో అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి. అమెరిక అప్పు వారి జీడీపీలో 108శాతం ఉంటే, మన అప్పు జీఎస్డీపీ లో 23.8శాతం మాత్రానే అని తెలిపింది.


రైతు రుణమాఫీ కింద రెండో వోడ్త రూ. 3900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి త్వరలోనే స్పష్టం చేస్తారని తెలిపింది.


రాష్ట్రంలో ఖాళీ పోస్తులు లెక్కలు తీసుకున్నాం. వాటిని వచ్చే బడ్జెట్ లో పడతామని స్పష్టం చేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: