చంద్రబాబును అంతా హైటెక్ సీఎం అంటుంటారు. ఆయన కాగితం లేని ప్రభుత్వాఫీసులు ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ టెక్నాలజీ సంగతి ఎలా ఉన్నా.. సర్కారు ఫైళ్లలో కదలిక మాత్రం ఊపందుకోలేదు. నత్తలను మించిన వేగంతో ఆఫీసుల్లో ఫైల్లు కదులుతున్నాయట. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయట. ఏంటనుకుంటున్నారా.. ఆఫీసర్లు చూడాల్సిన ఫైళ్లు... ఒక్క రెవెన్యూ డిపార్టుమెంటులోనే  రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఫైళ్ల సంఖ్య దాదాపు 3 లక్షలు ఉన్నాయట. ఒక్క కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా 39 వేల పైళ్లు పెండింగ్ లో ఉన్నాయట. 

విజయవాడలో ప్రస్తుతం కలెక్టర్ల మీటింగ్ అవుతోంది కదా.. అందులో ఈ పెండింగ్ ఫైళ్స సంగతి ప్రస్తావనకు వచ్చిందట. ఆంధ్రాలోని మొత్తం 13జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఇతర రెవెన్యూ కార్యాలయాల్లో మొత్తం  2లక్షల 68వేల ఫైళ్లు పెండింగులో ఉన్నాయట. ఈ సంగతి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ అనీల్ చంద్ర పునేఠ సీఎంకు చెప్పారు. 

ఈ నెల 16వ తేదీనాటికి రెవెన్యూ కార్యాలయాల్లో 3లక్షల 38వేల 870 ఫైల్లు పెండింగులో ఉంటే.. స్పెషల్ డ్రైవ్ ద్వరా వారం రోజుల్లో 60 వేలకుపైగా ఫైళ్లను వారం రోజుల్లో క్లియర్ చేశారని పునేఠ చెప్పుకొచ్చారు. ఇక ఫైళ్ల క్లియరింగ్ లో కర్నూలు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఫస్ట్ ప్లేస్ కొట్టేశాయట. ఇక విజయనగరం జిల్లాకు లాస్ట్ ప్లేస్ దక్కిందట. 

ఎలాగైనా ఈ ఫైళ్లను ఓ దారి చేయాలని భావించిన సర్కారు.. వాటిని వర్గీకరించే ప్రయత్నం చేశారు. ప్రతి జిల్లాలో నెల కంటే తక్కువ కాలం పెండింగ్ లో ఉన్నవి ఎన్ని.. నెల నుంచి మూడు నెలల వ్యవధిలో ఎన్ని ఉన్నాయి....  ఆ పై ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఎన్ని.. ఇలా వర్గాల వారీగా వీటిని గర్తించి ఓ రిపోర్ట్ తయారు చేశారట. వీటిల్ల్లో ఏడాదికి మించి ఎక్కువ పెండింగ్ లో ఉన్న ఫైళ్లే ఎక్కువట. 

ఏడాదికి మించి ఎక్కువగా  పెండింగ్ లో ఉన్న ఫైళ్ల లిస్టులో దాదాపు 17 వేల ఫైళ్లతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని జిల్లా కలెక్టరేట్ లలో కలిపి ఏడాది నుంచి పెండింగ్ లో ఉన్న దస్త్రాల సంఖ్య లక్షా 37వేల దస్త్రాలు ఉన్నట్లు తేల్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: