ఎవరైనా రెండు వేళ్లూ చూపించి ఒకటి ఎన్నుకోమంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటారు. ఆ రెండింటిలో ఏది బెటరో ఆలోచించుకుంటారు. దానికి కొంత సమయం తీసుకునైనా ఆలోచించి స్టెప్ వేస్తారు. కానీ అలా ఎంచుకునే వ్యక్తి చంద్రబాబు అయితే వీలైనంత వరకూ తనకు రెండూ కావాలంటారు. రెండు వేళ్లనూ తీసుకునే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో ఆలోచిస్తారు.

రీసెంటుగా సోమవారం రాత్రి టీడీపీలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక  ఎమ్మెల్సీ చేరడంతోనే మరోసారి రుజువైంది. ఎందుకంటే.. కర్నూలు, కడప, అనంతపురం జిల్లా వంటి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు నేతలను కాంప్రమైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఈ విషయంలో చంద్రబాబుకు గతంలోనే మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది.

అనంతపురం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దశాబ్దాల నుంచి శత్రుత్వం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత కుటుంబాల మధ్య కూడా ఆయన రాజీ కుదిర్చారు. అనంతపురం జిల్లాలో ఈ రెండు వర్గాలు ఒక పార్టీలో చేరి దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్నా.. ఇప్పటివరకూ ఓ అవగాహనతోనే సాగుతున్నాయి. చిన్నా చితకా సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బందులు లేవు. 

ప్రస్తుతం కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం, శిల్పా సోదరుల కుటుంబాల మధ్య ఎప్పటి నుంచి వైరం ఉంది. ఆ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడం అసాధ్యం అనిపించేది. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కుటుంబాలకు రాజీ కుదిర్చారు. అలాగే.. కడప జిల్లాలో ఆది నారాయణరెడ్డి,  రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య వైరం కూడా.. అంత సాధారణమైందేమీ కాదు. 

జేసీ- పరిటాల, భూమా-శిల్పా, ఆది నారాయణరెడ్డి- రామసుబ్బారెడ్డి.. ఇలా ఈ మూడు వర్గాల మధ్య రాజీ కుదర్చడంలోనే చంద్రబాబు విజయం దాగి ఉంది. ఇలాంటి బద్ద శత్రువుల మధ్య రాజీ కుదర్జాలంటే ఎంతో ఓర్పు, నేర్పు, సహనం అవసరం.. అలాంటి నేర్పు ఉండటం వల్లే చంద్రబాబు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వారి మధ్య ఐక్యత కొనసాగేలా చేయడమే ఇప్పుడు బాబు నైపుణ్యానికి మరో సవాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: