ప్రభుత్వం కృషి వల్లనే ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు అదనంగా 50 చొప్పున సీట్లను మంజూరు చేయాలని మెడికల్ కౌన్సిలింగ్ కు హైకోర్టు ఆదేశించిందని, వైద్యవిద్య, ఆరోగ్యశ్రీ మంత్రి కొండ్రు మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదాలు లేవని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఒకటేనని వైద్య సేవలను మెరుగుపర్చి ప్రభుత్వ ఆసుపత్రులపట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలన్నదే ప్రభుత్వ ధేయమని ఆయన అన్నారు. ఈ ఉద్ధేశ్యంతోనే ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలతో సీట్లు పెంచే విషయమై ముఖ్యమంత్రి చిత్తశుద్దితో కృషి చేశారని. అందుకోసం కేవలం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గులాం నభీ ఆజాద్ తోనే కాకుండా ఇతర మంత్రులతో కూడా మాట్లాడి హైకోర్టును సంప్రదించాలని వారిని కూడా కోరామని మంత్రి మురళీ తెలియజేశారు. సచివాలయంలో శుక్రవారం మంత్రి విలకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు వారు హైకోర్టులో ఫిటీషన్ వేశారని, కోర్టు కూడా వెంటనే స్పందించి మెడికల్ కౌన్సిల్కు ఆదేశించిందని దానికి తోడుగా ఈ రెండు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రస్తుతం ఢిల్లీలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని కొండ్రు మురళీ తెలియజేశారు. వైద్యకళాశాలల్లో మౌళిక సదుపాయిలను మెరుగుపర్చడానికి ముఖ్యమంత్రి రూ.60 కోట్లును, మందుల కోసం మరో రూ.60 కోట్లు మంజూరు చేశారని, ఇలాంటి చర్యలు వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ రోగుల సంఖ్య 12 శాతం నుంచి 17 శాతం నుంచి 17 శాతానికి పెరిగిందని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు రూ.30 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నామని మురళీ వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: