ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, ప్రపంచ దేశాలన్నీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. చాలా దేశాలను సక్షోభ సమస్యలు వెంటాడుతున్నాయని, నూతన విధానాలు, ఉద్దీపన చర్యలకు ప్రాధాన్యమిస్తే తప్ప ఇవి గట్టెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. ప్రపంచ ఆర్ధిక సవాళ్లపై ఓ నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. చైనాలోని షాంఘై లో నేటి నుంచి ప్రారంభం కానున్న జీ-20 దేశాల ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ లా అధిపతుల రెండు రోజుల సమావేశంలో ఈ నివేదికను సమర్పించనుంది. ఆ నివేదికలో ఉన్న వివరాలు ఇవిగో.....

*ఆర్ధిక ఉద్దీపనలు, గిరాకీ పుంజుకునేందుకు సంస్కరణలను వేగిరం చేయడంపై దేశాలు దృష్టి సారించాలి. పరపతి విధానంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేయాలి.

*ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పకుండా ఒకపక్క కఠిన నిర్ణయాలను తీసుకుంటూనే సరళమైన పరపతి విధానానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా మిగిలిన సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలి.

*2016 ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను తగ్గించాలని అనుకుంటున్నాం.( ఆరు వారాల క్రితమే వృద్ధి రేటు అంచనాను 3.4 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది).

*ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో సాగుతోంది. స్టాక్ మార్కెట్ల నష్టాలు, చమురుధరల పతనం, భౌగోళిక రాజకీయ పరిణామాలు దానిని మరింత గాడి తప్పేలా చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: