ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల్లో టీడీపీ మంత్రులు, కీలక నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారంటూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేకించి రాష్ట్రమంత్రివర్గం సమావేశమయ్యే రోజే ఈకథనం వెలువడంతో దీనిపై మంత్రివర్గంలో హాట్ హాట్ గా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  

సాక్షి పత్రిక ప్రచురించిన దురాక్రమణ కథనం అంతా అవాస్తవమని మంత్రులు అభిప్రాయపడ్డారట. కానీ రాష్ట్రంలో సాక్షి పత్రిక ప్రధాన పత్రికల్లో ఒకటిగా ఉన్నందువల్ల ఈ ఇష్యూ జనంలోకి వెళ్తుందని.. అందుకే సాక్షి కథనం అవాస్తవం అనే విషయాన్ని మంత్రులు కీలక నేతలతో పాటు టీడీపీ జిల్లా నేతలు ఎక్కడికక్కడ ఖండించాలని.. ఎదురుదాడి చేయాలని చంద్రబాబు సూచించారట. 

ఈ సమావేశంలో సాక్షి పత్రిక ప్రవర్తనపైనా తీవ్రంగా చర్చ జరిగిందట. ప్రతిరోజూ ఈ పత్రిక ఏదో ఒక రకంగా తెలుగుదేశం సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రలు ఆగ్రహం వ్యక్తం చేశారట. పటిష్టమైన క్రిమినల్ కేసులు పెట్టి సాక్షికి బుద్ది చెప్పాలని కూడా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అసలు అన్ని దుష్ప్రచారాలకు వేదిక అవుతున్న సాక్షి పత్రికను ఎందుకు మూసి వేయించకూడదన్న వాదనపై కూడా చర్చ జరిగిందట. 

సాక్షి పత్రిక ఆస్తులు జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీతో అటాచ్ అయి ఉన్నాయట. అటాచ్ మెంట్లో ఉన్నందువల్ల అవి సర్కారు ఆస్తులేనని.. వాటిని ఎప్పుడైనా స్వాధీనం చేసుకుంటామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంత జరిగాక చంద్రబాబు సర్కారు చూస్తూ ఊరుకోదని.. ఏదో ఒక యాక్షన్ ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. మరి బాబు ఏం చేస్తారో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: