భూటకపు ఎన్ కౌంటర్లపై జాతియమానవ హక్కుల సంఘం సీరియస్ గా    స్పందించడంతో భవిష్యత్తులో పోలీసులు భూటకపు ఎన్ కౌంటర్లు చేసేందుకు సాహసించక పోవచ్చుననే అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    11సంవత్సరాల క్రితం అప్పటి పోలీసు అధికారి కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పలువురుని ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చిచంపారని, పలువురు పోలీసుల చేతిలో చనిపోయారని ఈవిషయంపై మానవహక్కల ఫోరం న్యాయవాది మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేయగా విచారించిన మానవహక్కుల సంఘం పోలీసుల చేతిలో హతమైన కుటుంభాలకు 5లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.       దీంతో రానున్న కాలంలో ఈవిషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పోలీసులు ఎన్ కౌంటర్ల పేరుతో భూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడక పోవచ్చునని అంచనా వేయవచ్చు. కాగా 15రోజుల క్రితం చత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 19 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై సైతం విమర్శలు వచ్చాయి. చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ ను మీడియా, ప్రజాసంఘాలు, హక్కులసంఘాలు భూటకపు ఎన్ కౌంటర్ గా తేల్చి చెప్పింది.      కాగా కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ సైతం ఎన్ కౌంటర్ ను తప్పు బట్టారు. అమాయక గిరిజనులు చనిపోవడం బాధకరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇదే సందర్భంలో కేంద్రపభుత్వ హోంమంత్రిత్వశాఖ తొమ్మిది రాష్ట్రాల నక్సల్స్ ప్రభావిత ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో దీసిపై చర్చించారు. అమాయకుల ప్రాణాలు పోకుండా చూడాలని సమావేశంలో చర్చించినట్లు తెల్సింది.      దీంతో చత్తీస్ గఢ్ అడవుల్లో అమాయకులు చనిపోయినట్లు గుర్తించి ఇటువంటి నిర్ణయాలు తీసకున్నట్లు తెల్సింది. ఇలా మానవహక్కల సంఘాలు, మేధావులు, న్యాయవాదులు స్పందించడంతో భూటకపు ఎన్ కౌంటర్లు తగ్గే అవకాశముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: