ప్రకాశం జిల్లా మార్కాపురంలో సమాచార హక్కు చట్టం కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త శ్రీనివాసరావుకు విషపు ఇంజెక్షన్ తో పొడిచి దుండగులు పరారయ్యారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండడంతో... ఆయన్ని స్థానికులు ఒంగోలు రిమ్స్ అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్టీఏ కార్యకర్త శ్రీనివాస్ రావు పై హత్యాయత్నం చేయడాన్ని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ ఖండించింది. సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు ప్రత్యేక భద్రత కల్పించాలని పోరంఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది . కాంట్రాక్టర్లు అవినీతి సహ చట్టంక్రింద బయట పడకుండా ఉండేందుకు , చట్టకార్యకర్తల పై దాడులు చేసి బెదిరిస్తుంటారని ...ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషును ఖటినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తల రక్షణకు సంబందించి ప్రజావేగుల బిల్లును ప్రవేశ పెడితే దాడులకు పాల్పడిన వారి పై ఇంకా కఠిన చర్యలు తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: