తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్  మహిళా టీచర్‌ను పట్ల అసభ్యంగా ప్రవర్తించి విషయంపై ఇప్పటికే నిర్భయ కేసు నమోదు అయ్యింది. అయితే ఈ విషయం పై రావెల సుశీల్ ఫేస్ బుక్ లో స్పందించారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా కుక్క కనిపించలేదు. కుక్క అడ్డం రావడం వల్ల దాన్ని రక్షించే ప్రయత్నం చేశామని, ఈ సమయంలో ఓ యువతి వచ్చి గొడవకు దిగిందని రావెల సుశీల్ చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమైనవని అన్నారు. మరోవైపు మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన పోలీస్ అధికారు ఈ కేసును సీరియస్ గా తీసుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ సందర్భంగా సుశీల్ కారు అర కిలోమీటరు మేర యువతిని వెంటాడుతున్న దృశ్యం సిసి కెమెరాల్లో రికార్డయింది. సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే సుశీల్ చెప్పిన విషయంలో అంతగా నిజం లేదని తెలుస్తోంది. తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మహిళా టీచర్‌ను రావెల సుశీల్ కారు వెంబడిస్తున్న దృశ్యం ప్రసారమైంది. కారు వెంట పడుతుంటే యువతి పక్కకు జరిగి పోతుండడం కూడా కనిపించింది. అయితే, కుక్క పిల్ల కారుకు అడ్డం వచ్చినట్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే..రావెల సుశీల్ చెబుతున్న కథ అబద్ధమేనని సిసిటీవీ ఫుటేజీలను చూస్తే అర్థమవుతోంది.


ప్రస్తుతం సుశీల్, రమేష్ పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారిని అరెస్టు చేస్తామని డిసిపి వెంకటేశ్వర రావు చెప్పారు. సుశీల్, రమేష్ అరెస్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వారు పోలీసులకు లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు అరెస్టు చేస్తారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: