అసెంబ్లీ సమావేశాల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రొటీన్ ఫార్ములాలు ఉంటాయి. దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా రావడం, టీడీపీ ఎమ్మెల్యేలైతే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించిరావడం, ప్రతిపక్షాలు నల్ల కండువాలో, నల్లచొక్కాలో వేసుకురావడం.. ఇలా.. కొన్నాళ్లుగా అలా అలావాటైపోయాయి అందరికీ.

అలాగే శాసనసభ సమావేశాల తీరు కూడా. అది ఏ ఇష్యూ అయినా గొడవ చేసేయడమే ప్రతిపక్షాల ఎజెండాగా ఉంటోంది. గవర్నర్ ప్రసంగం విషయంలోనూ అలాగే జరిగేది. గవర్నర్ రొటీన్ గా అధికార పార్టీ ఇచ్చిన తన సర్కారు ప్రగతి నివేదిక చదవడం..దాన్ని ప్రతిపక్షాలు నిరసిస్తూ గొడవ చేయడం, వీలైతే ప్రసంగ పత్రాలు చించి గాల్లో ఎగరేయడం వెరీ రొటీన్. 

కానీ ఈసారి ఏపీ అసెంబ్లీలో మాత్రం అలా జరగలేదు. గవర్నర్ ప్రసంగం ప్రశాంత వాతావరణంలో అరగంటలో ముగిసింది. రొటీన్ కు భిన్నంగా ఈసారి విపక్ష వైకాపా సభ్యులు  తమ సీట్లలోనే ఉండి ప్రసంగం అంతా విన్నారు. అడపాదడపా కామెంట్లు చేసినా.. నినాదాలు చేసినా హద్దు మీరలేదు. ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వైకాపా ఈ తరహాలో ప్రవర్తించడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. 

ఈ మంచి సంప్రదాయాన్ని ఆ పార్టీ ముందు ముందు కూడా కొనసాగిస్తే మంచిది. అయితే ఇదే తరహా ప్రవర్తన ముందు ముందు సభల విషయంలో ఉంటుందా ఉండదా అన్న విషయం చూడాలి. ఎందుకంటే ఈ సారి ఏపీ  అసెంబ్లీ ముందుకు చాలా హాట్ హాట్ ఇష్యూలు డిస్కషన్ కు రాబోతున్నాయి. ప్రత్యేకించి రాజధాని భూముల కుంభకోణం, టీడీపీ వలసల ప్రోత్సాహవైఖరి ప్రధానంగా చర్చనీయాంశాలు కాబోతున్నాయి. మరి వైసీపీ అప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: