ప్రజలు ఎంతో నమ్మకంతో డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులను సంప్రదిస్తుంటారు. అయితే కొన్ని బ్యాంకులు చేసే మోసాలకు అడ్డంగా బుక్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ తమ అవసరాల కోసం తప్పని సరి బ్యాంకుల్లో తమ డబ్బు, బంగారం దాచుకుంటారు. తాజగా సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, జైపూర్, ఉదయ్‌పూర్‍లలో మంగళవారం సిబిఐ అధికారులు దాడులు చేశారు.సిండికేట్ బ్యాంకు  కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

మొత్తం పది ప్రాంతంలో తనిఖీలు చేసినట్టు సీబీఐ ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ తెలిపారు. గతంలో కూడా సిండికేట్ బ్యాంకులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో సిండికేట్ బ్యాంక్ సిఎండిగా పని చేసిన సుధీర్ కుమార్ జైన్‌ను రూ. 50లక్షలు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో అతడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: