భారత దేశంలో మగవారితో సమానంగా  చరిత్రలో నిలిచిపోయిన వీర వణితలు ఎంతో మంది ఉన్నారు. తల్లిగా, భార్యగా తన పాత్ర పోషిస్తూనే రాజ్యాన్ని కాపాడిన వీరవణితల చరిత్రలు భారత దేశంలో చాలా ఉన్నాయి.  చరిత్రలో కొంత మంది పేర్లు చిరస్థాయిగా నిలిచి పోయినా..కొంత మంది పేర్లు మాత్రం వెలుగులోకి రాలేదు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది వీర వణితలు తమ మాన, ప్రాణాలు వదిలారు. బ్రిటీష్ పరిపాలన వెనుతిరిగే వరకు మగవారితో సమానంగా పోరాడారు. ఇక ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. రాజకీయ,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అంతరిక్ష రంగంలో కూడా ముందడుగు వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంత మంది వీర వణితలు గురించి తెలుసుకుందాం. 


రుద్రమదేవి :


కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి . కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు.రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. రుద్రమదేవికి గల ఇతర   రాయగజకేసరి, ఘటోదృతి అనే బిరుదులు ఉన్నాయి. ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు.


ఝాన్సీ లక్ష్మీబాయి :


మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.


కల్పనా చావ్లా :


కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబం లో పుట్టారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు.   తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.


సునీతా విలియమ్స్ : 

సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి. సునీతా విలియమ్స్ ని అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. మహిళా అంతరిక్ష ప్రయాణీకులలో ఎక్కువసేపు అంతరిక్షయానం (195 రోజులు) చేసినవారుగా ఈమె ప్రపంచ రికార్డ్ సృస్ష్టించారు.  NASA యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా, ఆమె ISS యొక్క Node 3 కోల్బెర్ట్ రిపోర్ట్ను వెల్లడి చేయటానికి కనిపించారు. సెప్టెంబర్ 2007లో సునీతా విలియమ్స్ భారతదేశం పర్యటించారు. ఆమె సబర్మతి ఆశ్రమము కు వెళ్ళారు, ఈ ఆశ్రమమును మహాత్మా గాంధీ 1915లో స్థాపించారు ఇంకా ఆమె పూర్వీకుల గ్రామము గుజరాత్లోని ఝులాసన్ కు వెళ్ళారు. ఆమెకు సర్దార్ వల్లభాయి పటేల్ విశ్వ ప్రతిభ అవార్డును వరల్డ్ గుజరాతీ సొసైటీవారు ప్రధానము చేశారు, భారతదేశము మూలము కాని వ్యక్తి, ఎవరికైతే భారత పౌరసత్వము లేదో వారికి ఈ పురస్కారము యిచ్చినవారిలో ఈమె ప్రధములు.


సరోజినీ నాయుడు :


స్వతంత్ర పోరాటంలో మహాత్మాగాంధి పిలుపు అందుకొని వచ్చిన వారిలో ముఖ్య మహిళా నేత సరోజినీ నాయుడు. ఈమెను భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు. ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.ఇది శ్రీమతి సరోజినీ నాయుడుగారి హైదరాబాదు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు.తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహితాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నో లో ప్రశాంతంగా కన్ను మూసింది.


శ్రీమతి ఇందిరాగాంధీ :


 భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.  లాల్ బహదుర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. భారతదేశ ప్రప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. 1917 -11-19న అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలామనెహ్రూ,తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. ఈమెకి ప్రియదర్శని అని నామాంతరం కలదు. బాల చరఖా సంఘాన్ని స్థాపించినది. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. 1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ మరణించాడు. 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ మరణించడంతో ఇందిర జీవితంలో విషాదం ఏర్పడింది. తండ్రి మరణానంతరం ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.1984లో స్వర్ణదేవాలయంలో సైనికులను పంపి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి సిక్కు నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. 1984 అక్టోబర్ 31న eme తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. 








మరింత సమాచారం తెలుసుకోండి: