యూ పీ కి చెందిన అంజు బాలా అనే లేడీ ఎంపీ గురించి మీకు ఎంత వరకూ తెలుసు ? ఆమె గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఎలా తెలుసుకుంటారు ? గూగుల్ చేసి వికీపీడియా లో చదువుతారు అదే కదా పద్ధతి? కానీ ఆమె వికీపీడియా ఓపెన్ చేస్తే మీరు షాక్ కి గురవుతారు. ఎందుకంటే గత మార్చ్ మూడవ తారీఖు నుంచీ ఆమె చనిపోయినట్టు వికీపీడియా చూపించడమే దీనికి కారణం. అంజూ బాలా తన ప్రేస్తేజ్ ని డ్యామేజ్ చేసే విధమైన ఒక ఫోటో ని వికీ పీడియా వారు ఉంచారు అని కూడా ఆరోపిస్తున్నారు.




తన సెక్రెటరీ కి ఫోన్ ఒచ్చింది అనీ ఆ ఫోన్ సారాంశం ప్రకారం తాను చనిపోయిన విషయం చదివిన వ్యక్తి కాల్ చేసి కంగారు పడుతున్నాడు అనీ ఆమె చెప్పుకొచ్చారు. " ఆమె ఎలా ఉన్నారు ? ఆమె చనిపోయినట్టు ఇంటర్నెట్ ఓ చదివాను , కంగారు వేసి ఫోన్ చేసాను. పోయిన వారమే ఆమెని విమెన్ కాన్ఫరెన్స్ వీక్ లో కలవడం తో ఆమెకి ఇలా అవడం బాధ వేసి వెంటనే ఫోన్ చేసాను " అని ఫోన్ లో వ్యక్తి చెప్పడం తో అంతా అలర్ట్ అయ్యారు. ఈ విషయం లో లా మంత్రి సదానంద గౌడ కూడా తాము ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాం అనీ తగు చర్యలు తీసుకుంటాం అనీ అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: