అది పాక్ లోని స్వాట్ జిల్లా మింగోరా పట్టణం. ఆ ప్రాంతం లో చదువుకోవడమంటేనే ప్రాణాలతో చెలగాటం, అసలక్కడ ఇంటి నుంచి బయటికి రావడమంటేనే ప్రమాదం. కానీ చదువు కోసం ప్రాణాలకు తెగించింది. ఇప్పుడు ఆ చిన్నారి మలాలా యూసఫ్‌జాయ్ ప్రపంచ బాలికా విద్యకు ప్రతీక. ఆమె వయసు 15ఏళ్లు. 'తాలిబన్ల నీడలో నా బతుకు' అంటూ బీబీసీకి ఓ వ్యాసం రాసింది. ఈ వ్యాసం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక మలాలా జీవితంపై డాక్యుమెంటరీ తీయడంతో ఆమె ఒక్కసారిగా అందరికీ సుపరిచితురాలిగా మారింది. బాలికా విద్యపై ఆమె చేస్తున్న పోరాటాలు అందరికీ నచ్చాయి. ఒక్క తాలిబన్లకు తప్ప. 2012 అక్టోబర్ 9వ తేదీన తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. తలలో, వెన్నులో బుల్లెట్లు దిగడంతో మలాలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెను బ్రిటన్‌కు తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స లభించడంతో మలాలా ఇప్పుడు దాదాపు కోలుకుంది. మళ్లీ తొనక కుండా 'నేనువస్తా! చదువుకుంటా! చదివిస్తా!' అని అంటోంది. ఎందరో బాలికలకు ఈమే స్పూర్తి . అందుకే మలాలా ఈ ఏటి మేటి బాలికగా ఎంపికయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: