చట్టం ముందు అందరూ సమానమే అన్ని మరోసారి రుజువైంది..కోర్టు దిక్కార కేసులో కోయంబత్తూరు నగర పోలీసు కమీషనర్ అమల్ రాజ్ కు మద్రాస్ హైకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013 లో తనుకు ఎస్సైగా పదోన్నతి ఇవ్వాలంటూ సేలంలోని అప్పటి పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన వాటిని అమలు చేయలేదని దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని సేలంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సెంథిల్ నాథన్ మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశాడు.


గత వారం దీనిని విచారించిన న్యాయమూర్తి హరిపరంధామన్ కోర్టుకు ఆ కమిషనర్ ని హాజరు కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు మంగళవారానికి వాయిదా వేశారు. ఈ పిటీషన్ ను మంగళవారం మళ్లీ విచారణకు స్వీకరించిన పిలీషనుదారు తరుపున హాజరైన న్యాయవాది సదురు పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ ప్రస్తుతం కోయంబత్తూర్ నగర్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారని తెలిపారు.


కో్ర్టు ఆదేశాల మేరకు ఆయన హాజరు కాలేదని తెలిపారు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి చట్టాన్ని కాపాడాల్సిన అధికారి ఇలాంటి విషయాలపై నిర్లక్ష్యం వహించినందుకు గాను కమిషనర్ అమల్ రాజ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలంటూ న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: