“ జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా!
 కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై.....యెగసి పోదునో చెలియా నీవే నేనై”


ఈ అద్భుత గానామృతం అందులోని మాధుర్యం తెలుగువారికి అనుభవైక వేద్యమే. ఊహల్లో అనుభూతిని, కలల్లో అనుభవాన్ని సమంగా పంచే ఈ అనుభూతినే కాదు అనుభవాన్ని దినదినం చవిచూడటమేకాదు అందులోని రసామృతాన్ని తన అనుయాయులకు పంచటంలో కూడా......మన సకల కళావల్లభుడు విజయమాల్యా...ఆరితేరిన గ్రంధసాంగుడు. దేశము నుండి దొంగతనంగా  పలాయనంచిత్తగించటంలో చోర కళతో కలిపి 64 కళలలో నిష్ణాతుడనిపించిన విజయమాల్య, ప్రపంచపు (3) వ అతిపెద్ద బ్రేవరిస్ సంస్థ యునైటెడ్ బ్రేవరిస్కు చైర్మన్ (ఇప్పుడు మాజీ అయ్యారు లేండి)....ప్రపంచములో ‘డియాజియొ’ మరియు, ‘పెర్నాడ్ రికార్డ్’ లాంటి సంస్థల తరువాత బెవరేజెస్ వ్యాపారములో ఇదే పెద్ద తయారీ పరిశ్రమ.


విజయమాల్య తనను తాను తరచుగా "వరల్డ్స్ బిగ్గెస్ట్ లిక్కర్ బారన్ & కింగ్ ఆఫ్ గుడ్-టైంస్ గా పిలవబడే-రిచర్డ్ బ్రాన్సన్" తో పోల్చుకోవటం జరిగేది. నిజంచెప్పాలంటే ఈ పోలిక తప్పు. బ్రాన్సన్ నేల...నుండి...నిగికెగస్తే .... విజయమాల్య మాత్రం నొట్లొ బంగారు చంచాతో జన్మించిన -విఠ్ఠల్ మాల్య- గారి ఏకైక పుత్రరత్నం. తండ్రి చక్కని క్రమశిక్షన, నైతికవర్తన కలిగిన వ్యాపార ధిగ్గజం. తల్లి లలితా రామయ్య ఒక ఆదర్శ గృహిణి, సంస్కార ప్రియురాలు, చక్కని గౌరవ ప్రతిపత్తులున్న వనితా రత్నం. ఆమె పెంపకంలోనే ఎదిగాడు ఈ పుత్రరత్నం.. తల్లి తండ్రు ల అడుగు జాడల్లో ఏదిగినా...వ్యాపారాన్ని, పరిశ్రమలని వందల గుణాంకాలలో పెంపొందించి 60 కి పైగా నూతన సంస్థలను స్థాపించటం ప్రారంభించాడు.


నేటికి $800 మిల్లియన్ డాలర్ల నెట్-వర్త్ ఉన్న మాల్య కొంకిణి మాట్లాడే ‘గాడ్ సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మాంగళూరియన్’ . కలకత్తాలో సెయింట్ జేవియర్ కాలేజీ నుండి పట్టభద్రుడైన విజయ్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యములోకి 28 వ ఏట తనతండ్రి మరణానతరం ప్రవేశించాడు. పాటశాలలో నుండే నాయకత్వ లక్షణాలున్న విజయ్ బహుముఖ ప్రజ్ఞాధురీణుడే. రెండుసార్లు వివాహం చేసుకున్న విజయ మాల్య తొలి భార్య సమీరా త్యాబ్జీ, ఈమె ఏయిర్ ఇండియాలో ఫ్లయిట్ అటెండెంట్. వీరికి జన్మించిన వారే ‘సిద్దార్ధ్ మాల్య’  తరవాత విభేదాలు పొడచూపి విడాకులు తీసుకున్నా ఇరువురు సన్నిహిత సంభందాలు కలిగే ఉన్నారంటారు విజయ్.


ద్వితీయ కళత్రమైన రెఖ అప్పటికే రెండుసార్లు విఫ్హలమైన వివాహాలతో (పక్కింటి అమ్మాయి) విజయ్ కు ఇద్దరు సంతానం వారే లీనా , తాన్య. రెఖ తొలి భర్త ప్రతాప్ చెట్టీప్ప- కూర్ఘ్ కు చెందిన కాఫీ ప్లాంటేషన్ యజమాని- వీరికి సంతానం లేదు. రెండవ భర్త షాహీద్ మహమ్మద్ -తో ఇద్దరు సంతానం -వారే లైలా & కబిర్. లైలాను విజయ్ దత్తత తీసుకొని సొంత కూతురుగా పరిగణిస్తున్నారు. విలాసజీవితాన్ని ఇష్టపడే మాల్య పిల్లందరిపై అప్యాయతకలిగి ఉన్నట్లు చెపుతాడు.

మోడల్స్ తో విజయ్ మాల్య


ఈ ఆడంబర, విలాసపురుషుడితో కంటే తనసంతానంతోనే సాన్-ఫ్రాన్సిస్కొ లోనే ఉంటున్నారు రెఖ. పారి స్లో ‘బాల్ డి డెబుటాంట్స్’ అరంగేట్రం చేసిన 21 యేళ్ళ లీనా కూడా తల్లితోనే ఉంటున్నారు. తాన్యా కు 18 సంవత్సరాల వయసు.  లైలా మాల్య స్వంతంగా "లైఫ్ స్టయిల్ ప్రొడక్ట్, అక్సెస్సరిఎ ఔట్ సోర్సింగ్" ఎంట్రప్రీన్యూర్ @ యూరోఫ్ & అమెరికా. 35 యేళ్ళ వయసున్న ఈమే భర్త పేరు సమర్ సింగ్.
“ప్రిన్స్ ఆఫ్ గుడ్ టైంస్”  గా పిలవబడే సిద్ ఉరఫ్ సిద్దర్ద్ మాల్య లండన్ లోని క్వీన్ మేరీ కాలేజ్లో నుండి బిజినెస్ ఏడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేట్. ఇప్పుడు తన తండ్రి వ్యాపారాల విస్తరణలో తనమునకలై ఉంటూనే - సినిమా హీరో అవ్వాలనే తపనతో అరంగంతో స్నేహం కొనసాగిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: