ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మరోసారి విజృంభించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో పెరగడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇది ప్రతి సామాన్యుడికి చెందిన  అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ప్రజలపై దీనివల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.

మొన్నటి దాకం ధరలు దగ్గించారని..కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ పై రేట్లు పెంచడం ఎంత వరకు సబబు అని అన్నారు. అందువల్ల ఈ అంశంపై చర్చించాల్సిందేనని, అవసరమైతే దీనికోసం జీరో అవర్‌ను రద్దు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31 శాతం ప్లస్ నాలుగు రూపాయలు, డీజిల్‌పై 22.1 శాతం ప్లస్ నాలుగు రూపాయల వ్యాట్ విధిస్తున్నారని ఆయన చెప్పారు.

సామాన్యులపై భారం మోపిన డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్లుతుందని గుర్తు చేశారు. ఏపీ సర్కార్ అవలంభిస్తున్న తీరు తో సామాన్యలు నడ్డి విరిచినట్లు అవుతుందని ఎప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలని  సర్కారు తీరువల్లే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: