తెలంగాణలో ఓవైసీ సోదరులంటే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలబడుతుంటారు. మొన్నామద్య తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అన్న నినాదం చేయబోనని ఎంఐఎం పార్టీ అధినేత అససుద్దీన్ ఒవైసీపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టంచారు. ఈ అంశంపై రాజ్యసభలో పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా  అసదుద్దీన్ ఒవైసీపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

జాతీయ పతాకాన్ని అగౌరవపర్చాడని పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్‌పటేల్‌పై దేశద్రోహం కేసు పెట్టగా.. అతడు ఇంకా జైలులోనే ఉన్నాడని, మరి దేశమాతను అవమానించిన ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. ఎవరైతే భారత్ మాతా కీ జై అని నినదించరో వారందరి పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

అంటే సామాన్యులకు ఓ న్యాయం..రాజకీయ నాయకులకు ఓ న్యాయమా అని ప్రశ్నించింది.  ఒవైసీలాంటి వ్యక్తుల వల్లనే ముస్లింలు వెనుకబడి ఉన్నారని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు శివసేన వ్యాఖ్యలను ఖండించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: