ఆంద్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ  మ‌రోసారి అట్టుడికిపోయింది. నిన్న శుక్ర‌వారం జ‌రిగిన సీన్ నేడు రిపీట్ అవుతోంది.  హైకోర్టు నుంచి సస్పెండ్ స్టే ఆర్డ‌ర్ ఉన్నా, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ను అసెంబ్లీ లోకి అనుమ‌తిని ఇవ్వ‌క‌పోవ‌డంతో, నిన్న రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద పాద‌యాత్ర తో వెళ్లి గ‌వ‌ర్న‌ర్ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించిన సంగ‌తి విదిత‌మే. అయితే ఈ రోజు సమావేశంలో భాగంగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ కి వ‌చ్చారు. అక్క‌డే ఉన్న‌ మార్షల్ రోజా రాకను అడ్డుకున్నారు. రోజా మార్షల్ తో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు రోజా క‌న్నీటి ప‌ర్యాంత‌మయ్యారు.  మ‌రోసారి స్పీక‌ర్ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేద‌ని, అందుకోస‌మే అడ్డుకుంటున్నామ‌ని మార్షల్ వారిస్తున్నారు. దీంతో మ‌రోసారి అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఉద్రిక్త‌త నెల‌కొంది.


మ‌రోవైపు... ఎమ్మెల్యే రోజాను అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంలో ఏపీ స‌ర్కార్, అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ ల వైఖ‌రీకి నిర‌స‌న‌గా నేడు వైకాపా ఎమ్మెల్యే న‌ల్ల ద‌స్తుల‌తో అసెంబ్లీ హాల్ లోకి హాజ‌ర‌య్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌సంగాన్ని అడ్డుకొవ‌డానికి స్పీక‌ర్ పోడియం చుట్టు ముట్టారు. మ‌హిళా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ స‌భ‌లో అనుమ‌తించాల‌ని నినాదాలు చేశారు. స‌భ‌లో గంద‌ర గోళం సృష్టిస్తున్నారు. రోజాను అనుమ‌తించేంత వ‌ర‌కు స‌భ‌ను జ‌ర‌గనివ్వ‌మంటూ పోడియం చ‌ట్టుముట్టి స‌భ‌లో అడ్డ‌కునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: