తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి దూకుడు కలకలం రేపింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు సంబంధించి క్వశ్చన్ అవర్ లో జరిగిన చర్చ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిసేపు తెలంగాణ అసెంబ్లీలో గందరగోళానికి దారి తీశాయి. కరువు పరిస్థితులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత.. అనుబంధ ప్రశ్నల కోసం కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులంతా ప్రయత్నించారు.

స్పీకర్ మధుసూధనాచారి అవకాశం ఇవ్వకపోవడంతో విపక్ష సభ్యులు అందోళనకు దిగారు. ఈ సమయంలో సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి దూకుడు ప్రదర్శించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి  వైపు అవేశంగా దూసుకెళ్లారు. అంతే కాదు.. పోచారం ముందున్న బల్లపై కాగితాలు పడేశారు. పోచారంతో వాగ్వాదానికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌ కుమార్‌ జీవన్‌రెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. 

ఐతే.. ఈ జీవన్ రెడ్డి వ్యవహారశైలిపై అధికార పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ గందరగోళం మధ్యే సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభకాగానే ప్రతిపక్షనేత జానారెడ్డి సభను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఒక్కోసారి సభ్యులు ఒక్కోసారి ఆవేశంగా స్పందిస్తుంటారని.. వారిని నిబంధనల పేరిట తొక్కిపెట్టాలని చూడడం సమంజసం కాదన్నారు. 

జీవన్ రెడ్డి ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి సంయమనం కోల్పోయరాని ప్రతిపక్ష నేత జానారెడ్డే చెబుతున్నారని కామెంట్ చేశారు. సినీయర్‌ అయిన జీవన్‌రెడ్డికే అంత అవేశం ఉంటే.. తమలాంటి యువకులకు ఇంకెంత ఆవేశం ఉండాలని ప్రశ్నించారు. తమపై చూపిస్తున్న అవేశాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి 

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపి ఉంటే బాగుండేదన్నారు. తాను పోచారం వైపు చర్చించేందుకే వెళ్లాలని దాడికి ప్రయత్నించలేదని జీవన్‌‌రెడ్డి వివరణ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: