అసెంబ్లీకి వచ్చిన కొత్తలో కాస్త తడబడినా వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. పొలిటికల్ సెటైర్లు బాగా వేస్తున్నారు. పంచ్ డైలాగులపైనా ఆయన టీమ్ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తోంది. మంగళవారం జలదినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో జగన్ వదిలిన ఒక పొలిటికల్ సెటైర్ చంద్రబాబును బాగానే చిరాకు పెట్టి ఉంటుంది.  

ప్రత్యేకించి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారాన్ని జగన్ బాగా ఎండగట్టారు. ఏ ఏ ప్రాజెక్టుకు ఏ ఏ సర్కారు ఎంత సొమ్ము వెచ్చించిందో లెక్కలతో సహా వివరించే సరికి అధికార పక్షం కంగుతినాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని జగన్ సెటైర్ వేశారు. తోటపల్లి ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు ప్రచరాం చేసుకోవడాన్ని జగన్ తప్బుబట్టారు. 

తోటపల్లి ప్రాజెక్టు అంచనా వ్యయం 527 కోట్లైతే.. గత తొమ్మిదేళ్ల కాలంలో కేవలం 3 కోట్లే ఖర్చు చేశారని గుర్తు చేశారు జగన్. ఆ తర్వాత వై.ఎస్. రాశేఖరరెడ్డి హయాంలో 398 కోట్లు ఖర్చు చేశారని.. మళ్లీ వై.ఎస్. మరణానంతరం 52 కోట్లు ఖర్చు చేశారని సాధికారికంగా లెక్కలతో సహా వివరించారు. మొత్తం మీద చంద్రబాబు 60 కోట్లు కూడా ఖర్చు పెట్టని విషయాన్ని సోదారహణంగా వివరించారు. 

530 కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ ను పక్కకుపెట్టి.. తానే శంకుస్థాపన చేశా.. తానే ప్రారంబిస్తున్నానంటూ డబ్బా కొట్టుకుంటున్నారని క్లియర్ కట్  గా వివరించారు. వంశధార విషయానికి వస్తే.. దీని అంచనా వ్యయం 1242 కోట్లు అయితే.. చంద్రబాబు హయాంలో కేవలం 44 కోట్లే ఖర్చు చేశారని జగన్ వివరించారు. వై.ఎస్. రూ.657 కోట్లు ఖర్చు చేశారని.. ఆ తర్వాత మరో రూ.138.96 కోట్లు వెచ్చించారని వివరించారు. 

అన్నీ వివరించి.. దీన్ని బట్టి ప్రాజెక్టులు కట్టిన వాడు గొప్పవాడా.. లేక దాన్ని శంకుస్థాపన చేసిన వాడు గొప్పవాడా అంటూ పొలిటికల్ పంచ్ విసిరారు జగన్. అంతేకాదు.. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఈపీసీ కాంట్రాక్టుల్లో పెంపుదలకు అవకాశం కల్పించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు... ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: