టీవీ9.. ప్రాంతీయ భాషా న్యూస్ ఛానెళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన టీవీ9.. ఇప్పుడు మరో ప్రయోగానికి అంతా సిద్దం చేసింది. కన్నడ, గుజరాత్ భాషల్లోనూ టీవీ9 తన సత్తా నిరూపించుకుంది. ఓ జాతీయ నెట్ వర్క్ గా ఎదిగింది. ఇప్పుడు వాటిన్నికంటే ప్రధానమైన హిందీ ఛానెల్ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే టీవీ9 హిందీ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఎన్నికల సమయంలో న్యూస్ ఛానళ్లకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు.. త్వరలో 5 రాష్ట్టాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి కంటే ముందుగానే టీవీ9 హిందీ ఛానల్ ను ప్రారంభించాలని టీవీ9 గ్రూపు శతవిధాల ప్రయత్నం చేస్తోందట. ఛానల్ సీఈవో రవిప్రకాశ్ ప్రస్తుతం ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారట. 

ఐతే జాతీయ స్థాయిలో సత్తా చాటడమంటే మాటలు కాదు.. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్డీటీవీ, సీఎన్ ఎన్ ఐబీఎన్, ఆజ్ తక్, వంటి ఛానళ్లు అక్కడ పాతుకుపోయాయి. వాటి కంటే విభిన్నంగా ముందుకు వెళ్లగలిగినప్పుడే టీవీ9 హిందీకి విజయావకాశాలు ఉంటాయి. అయితే తెలుగు, కన్నడ, గుజరాత్ భాషల్లో సక్సస్ అయిన టీవీ9 గ్రూపు నుంచి వచ్చిన మ‌రాఠీ, ఇంగ్లీష్ చానెళ్లు అంతగా క్లిక్ కాలేదు. 

తెలుగులోనూ ఆ గ్రూపుకే చెందిన జై తెలంగాణ టీవీ పరిస్థితి అంతంత మాత్రమే. మరి ఇప్పుడు ఈ టీవీ9 హిందీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీవీ9 హిందీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.. ఓ తెలుగువాడు జాతీయ స్థాయిలో సత్తా చాటడం మనకూ గర్వకారణమే కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: