ప్రజాస్వామ్యంలో అనంతమైన అధికారం అరాచకానికి, అంతకు మించి నియంతృత్వానికి బాటలు వేస్తుంది.


రాజమౌళి విస్తృత పరచిన సినిమా ఆలోచనే "కథానాయకుణ్ణి గొప్పగా చూపించాలంటే, ప్రతి కథానాయకుని పాత్రను మరింత సృజనాత్మకంగా మలచాలి"


ఇదే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకూ వర్తిస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజా పాలనా వ్యవస్థ లు మూడు. అవే ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన (మూడు ఎస్టేటులు) 1. శాసనసభ, 2. న్యాయవిభాగం, 3. కార్యనిర్వాహకశాఖ అవి సరిగ్గా పనిచేయాలంటే శాసనసభలో ఉత్తమ శాసనాలు నిర్మించబడాలి. అలా జరగాలంటే అధికార పక్షానికి ధీటైన ప్రతిపక్షO సభలో ఉండటం అతిముఖ్యమైన అవసరం.


ఏదైనా కారణంతో ప్రతిపక్షం బలహీనమైతే ఆ పాత్రను విజయవంతముగా పోషించటానికి నాలుగవ మూలస్తంభమైన "ప్రసార మాధ్యమం" (మీడియా) ఆ విలువను సంతరించుకుంది.


ఇప్పటి మీడియా కొందరు వ్యక్టుల, కొన్ని రాజకీయాపక్షాలకే స్వంతమవటంతో 'ఫొర్థ్-ఎస్టేట్' అనే మీడియా సమాచారము యొక్క విస్వసనీయత సన్నగిల్లి కొందరికే కొమ్ముకాసే 100% ప్రైవేట్ వ్యవస్థ గా రూపుదిద్దుకుంది. ఇది అత్యవసర పరిస్థితి కాలము (అంటే 21 నెలల కాలం 1975 నుండి 1977 వరకు) నుండి మరీ ఎక్కువై, ముడి- సమాచారముగానే నిలుస్తుంది. అంటే దీనిని సమాచారం అనాలంటే కొంత నిజానిజాల్ని గ్రహించవలసిన భాద్యత పాఠకుడు లేదా ప్రేక్షకుని విజ్ఞతపై ఆధారపడిఉంటుంది.


అందుకే సమర్ధవంతమైన ప్రతిపక్షం ప్రజలకు సభలో ఉండటం చాలావసరం.


అలా కానప్పుడు శాసనాలు చేసే వాళ్ళు వాటిని తమ స్వప్రయోజనాలకే ఉపయోగపడేలా తయారు చేస్తారు. ప్రతిపక్షం దానిని నిరోధించాలి. అంటే సమర్ధవంతముగా, బలమైనదిగా ఉండాలి.


శాసనసభ నిర్మిత శాసనాలను ప్రజా వేదికపై అమలుపరచే భాధ్యత కార్యనిర్వాహకశాఖది. శాసనాల నిర్మాణం తదుపరి అమలు పరచే సంధర్బాల్లో తలెత్తే చట్టపరమైన అడ్డంకులను సలహాలు, అదేశాల రూపములో న్యాయవిభాగం సహకారం అందిస్తుంది. అలాగే సమస్యలు తలెత్తితే పరిష్కారాలు చూపిస్తుంది.


ఒకసారి శాసనమైన తరువాత ఆశాసనాన్ని అమలు పరచేటప్పుడు రెండు రాజ్యాంగ సంస్థల మధ్య సమన్వయం కుదిర్చే భాధ్యత న్యాయశాఖది మాత్రమే. శాసన నిర్మాతలైన ఆ సభ్యులు కూడా ఇందులో తలదూర్చరాదు. మార్పులు చేయాలంటే చట్ట సవరణ ద్వారా మాత్రమే జరగాలి.


అంతే గాని చట్టాన్ని చేసేది మేము మేమే సర్వోన్నత అధికారం కలిగి ఉంటామనే భాషన సరైనదికాదు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో సభాపతులు తమ ఆధిపత్యం చూపి చట్టాలకు తమకు తోచిన ఉపాఖ్యానాలు చేస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ (ఇందులో సభాపతులపై సభానాయకుని వత్తిడి సభా సమయాల్లోనే బహిరంగంగా కనిపిస్తుంది) శాసనసభ అంటే మునిసిపల్ మార్కెట్ కంటే అధ్వాన్నం చేస్తున్నారు.


ఏదైనా న్యాయం విషయంలో సంధిగ్దత తలెత్తి న్యాయస్థానం అదేశాలిస్తే అవి సభాపతికి అనుకూలంగా లేకుంటే ...అప్పుడు సభాపతి తనదే తుది నిర్ణయమే రూలింగ్ ఇవ్వటం సహజ పరిణామమైంది. ఇది జాతికి ఒక రకంగా అన్యాయం చేయటమే. ఇరు పక్షాల సభ్యులు సభలో అసభ్య వాదనలు చేసుకొని అనవసర వాదాలకు వెళ్ళి న్యాయస్థానాల తలుపు తట్టి అనవసర విషయాల్లో న్యాయశాఖను రహదారిపై లాగి ఎవరిది గొప్ప రాజ్యాంగ విభాగం అని ఎవరికివారు బాహాబాహికి దిగటం చూస్తూనే ఉన్నాము.


ఇలాంటప్పుడు న్యాయవిభాగం కొంచం వెనక్కుతగ్గటం చూస్తున్నాము. కారణం తెలియటము లేదు. తన విశిష్టతను నిరూపించుకోక పోవటం న్యాయ విభాగం తన భాధ్యత నుండి విముక్తమవ్వటం స్పష్టంగా కనిపిస్తుంది.


AP Legislative Assembly Business Rules 340 (2) ప్రకారం ఒక సభ్యుని సభనునుండి ఒక సెషన్ కాలం మాత్రమే అభిశంసించవచ్చు. కాని సభాపతి ఒక సంవత్సరం అభిశంసించారు. అది ఇక న్యాయశాఖ పరిదిలోనికి వెళుతుంది కాని సభాపతి తనదే తుది నిర్ణయమని వాదించి గెలిచారు. ఇక్కడ న్యాయవిభాగము తన భాధ్యతను విస్మరించటానికి “గొడవెందుకులే” అనే ఉదాశీనత/నిర్లక్ష్యమే కారణం.


దీనివలన ఐదు సంవత్సరాలలోని ఒక సంవత్సర కాలం ఆ నియోజకవర్గ ప్రజా ప్రాతినిధ్యం ఆ సభ, ఆ నియోజకవర్గ ప్రజలు కోల్పోయారు. అతి దయనీయమైన పరిణామం ఇది. సభాపతి ఆ అభిశంసన లో అధికరణం 194 (3) కు బదులు 340(2) ఉదహరించామన్నారు. దానికి అనుభవజ్ఞుడైన సభాపతి మరియు suspension item లేవనెత్తిన మాజీ సభాపతి నేటి సభలో సభ్యుడూ, మంత్రి కూడా అయిన ఒక వ్యక్తి తప్పుడు సలహాయే కారణం. ఇద్దరు ముద్దాయిలు విచారణ నుండి తప్పించుకున్నారు. దీనికి అనుభవ రహిత ప్రతిపక్షం మాత్రమే కాకుండా, న్యాయవిభాగ ఉదాశీనత కారణమనిపిస్తుంది.


అంటే కాదు ధర్మం అన్నితికంటే ఉత్తమమైంది, ఒక ఎమెలే అభిశంసన ఒక నియోజకవర్గ ప్రాతినిధ్యకాలం కొంత పోగొట్టింది. ఈ కాలములో ఆ నియోజకవర్గ ప్రజలు కోల్పోయేది తమ విలువైన ప్రాతినిధ్యం.


ఈ మొత్తం తతంగములో అమారావతిలోని ఒక వర్గ ప్రయోజనాలు రక్షించబడ్డాయి. అంటే కాల్-మని అనబడే అతి కిరాతకపు వడ్డీ వ్యాపారం అనే శ్లేష్మంలో చిక్కుకున్న ప్రజల ఆహాకారాలు, వనితల మాన శీల భంగము. దోచబడ్డ జాతి పడతుల పరువు-ప్రతిష్టలు. అధికార పక్షానికి అవి పెద్దలెక్క కాక పోవచ్చు. కాని విశ్వం మనవైపుచూస్తుందనే లోకనాయకునికి ఇవి లెక్కలోకి రావాలి. లేకుంటే ఆయన మృతజీవుడే.


ఎం.ఎల్.ఏ సభా అభిశంశన అనే ఈ రగడ అతి ముఖ్యమైన అసాంఘిక సమస్యను మరుగున పడేసింది. దీనికి ఎవరిది భాధ్యత. ఈ మూడు రాజ్యాంగ మూలస్థంబాలను ఈ సమస్య వధ్యశిలపై పరుండబెట్టింది. ఎం.ఎల్.ఏ ముఖ్యంకాదు. విచారణ తప్పించుకున్న అమరావతి లోని ఒక వర్గ ముద్దాయిలు. దీనికంతటికి సమర్ధవంతమైన ప్రతిపక్షం క్రమంగా అంతరించిపొతుండటమే.


రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలను నిర్వీర్యం చేసే దుర్మార్గం వెల్లివిరుస్తుంది, విలసిల్లుతుంది. ఈ అనైతిక కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతుంది. ఏన్నికలలో ప్రజలు విశదపరచిన ప్రాతినిధ్యం శాసనసభల్లో ప్రతిబింబించట్లేదు. ఐదు సంవత్సరాల కాలానికి ఒక పార్టి అభ్యర్ధిని ప్రజలు ప్రతినిధిగా శాసనసభ కు పంపితే ఆ సభ్యుడు ఆర్ధిక, రాజకీయ, అలౌకిక ప్రలోభాలకు లొబడి అధికార పక్ష నిర్భంద ప్రయోజనాలకు బలై తన పార్టి రూపు మార్చుకొని సభలో మరో అవతారం ఎత్తి ప్రజాద్రోహానికి తలపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో ఒక ప్రతిపక్ష పార్టి తమసభ్యులు అధికార పక్షలో చేరి అవసాన దశకు చేరుకుంది. దీనికి 'ఆపరేషన్ ఆకర్ష్' అనే పేరు. సభాపతి తనకు చేరిన పార్టి మారిన సభ్యుల రాజీనామాలపై నిర్ణయము దీర్ఘ వాయిదావేసి అధికార పక్ష ప్రయోజనాలకు కాపలా కాస్తున్నారు. సభాపతి చేయవలసిన పనేనా ఇది? ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలే ఇందుకు కారణం. దాదాపు తెలంగాణా శాసనసభలో విపక్షం అంతరించి పోయింది.


ఇక్కడ ప్రతిపక్షంగా మాయమై కబ్జాకు గురైన పార్టి అంధ్రప్రదెశ్ లో అధికారం లో ఉండీ తనూ అదే మార్గంలో పయనిస్తూ అక్కడి మరో ప్రతిపక్షాన్ని అంతరింపచేస్తుంది. ఇది ఇరు ప్రాంతాల అధికారా పక్షాలకు క్షంతవ్యం కాదు.


దీని ఫలితమే, ప్రజా సమస్యలు సభలోనే సమాధి అవుతూ ఇరు రాష్ట్రాలో నియంతృత్వం పరిడవిల్లుతుంది. ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగి ప్రాతినిధ్యంకాని ఎలాంటి విలువ లేకుండా పోతుంది.


ఈ తతంగం అంతటికి కారణం సభాపతుల అసమర్ధత, స్వార్ధం, సభ్యులుగా తాము చేసిన ప్రమాణ విద్రోహమే. ఇది ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది.


మరింత సమాచారం తెలుసుకోండి: