ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం భారత్ లోని ఐటీ రంగంపై 2013 సంవత్సరంలో తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఐటీ రంగంలో నెలకొన్న పరిస్థితులతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ కొరత, రాజకీయ అనిశ్చితి తదితర అంశాలు భారత ఐటీ పరిశ్రమ వృద్ధి మందగించడానికి కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్నేళ్ళు గా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ఐటీ పరిశ్రమ వృద్దికి అవరోధంగా మారాయన్నారు. ట్రాఫిక్ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వం రోడ్ల విస్తరణ, కీలక జంక్షన్ల వద్ద రోడ్ల విస్తరణ చేపట్టాలని ఐటీ పరిశ్రమ ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వెంటనే ఈ సమస్యను తీర్చేదిశగా ప్రయత్నాలు చేపట్టాలని ప్రభుత్వానికి పలు ఐటీ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యుత్ సమస్య ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మనగడ, వృద్ది ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి ఏర్పడనుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.2009 సంవత్సరంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం భారత ఐటీ పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉందని...  వేతనాల పెంపు, వృద్ది రేటు మందగించడం లాంటి సమస్యలు ఐటీ రంగానికి ఇబ్బందిగా మారాయన్నారు. దాంతో ఈ ఏడాది 2013 లో నాస్కామ్ నిర్ధేశించిన 11 శాతం వృద్దిని సాధించడం కష్టమేనని ఐటీ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: