భారత దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ మొదలైంది.  ఇక కేరళ ఎన్నికల ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఇక్కడ

1. కాంగ్రెస్ నాయకత్వం లోని - యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యు.డి.ఎఫ్)

2. సిపిఎం నాయకత్వం లోని - లెఫ్ట్డెమోక్రటిక్ఫ్రంట్(ఎల్.డి.ఎఫ్)

ముఖ్యమైన పార్టీలు.


బిజెపి నాయకుడు రాజశేఖరన్ అభిప్రాయం ప్రకారం వీరు బిజెపి కి కేరళ లో స్థానం లేకుండా చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు చెపుతారు. అందుకే బిజెపి ఏలాగైనా కేరళ లో పాదం మోపాలని పట్టుదల తో ఆశిస్తుంది.  2011 అసెంబ్లి ఎన్నికలలో (140) సీట్లున్న కేరళలో - కాంగ్రెస్ సారధ్యం వహిస్తున్న యుడిఎఫ్ కు (74 - 46.3%) సిపిఎం సారధ్యం వహిస్తున్న ఎల్.డి.ఎఫ్ కు (66 - 45.4%) సీట్లు గెలిచాయి. పార్టీల బలాబలాలలో అధిక్యం వహించుతున్న యు.డి.ఎఫ్ 8 సీట్లు భేదంతో 0.9% ఓట్ల ఆధిక్యంతో "నెక్ టూ నెక్" గెలుపుతో అధికారం లోకి వచ్చింది.  2014 లోక్-సభ ఎన్నికల్లో (20) సీట్లలో - యుడిఎఫ్ (12 - 42.6%) ఎల్.డి.ఎఫ్ (8 - 40.17%) గెలిచాయి.


భారత ప్రధాని నరేంద్ర మోడీ


ఇక్కడ కూడా యుడిఎఫ్ 2.43% స్వల్ప ఆధిక్య ఓట్లతో 50% సీట్లు ప్రత్యర్ధి కన్న ఎక్కువ పొందింది. బిజెపి కి ఇక్కడ కూడా ఏమాత్రం స్థానం అప్పుడు లేదు. కాని ఇప్పుడు బిజెపి కేరళలో కాలూనాలను కొంటుంది.  సుమారు ఐదు దశాభ్దాలుగా కేరళలో సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతున్నా, రూలింగ్ పార్టీని తిరిగి గెలిపించని, ఆచారమున్న కేరళలో ఇప్పటి టర్న్ ఎల్.డి.ఎఫ్ ది అవాలి. కాని అన్నీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించటానికి కూడా తంటాలు పడుతున్న కొత్త స్థితిని ఎల్.డి.ఎస్ చేస్తుంది. రెండు నెల కన్నా తక్కువ సమయమున్న తరుణంలో బలమైన ముక్కోణపు పోటీని కెరళ చవి చూడబోతోంది అవీ బిజెపి తో కలిపి.


ఇక్కడ తమ సైద్ధాంతిక ఆదేశకర్తలైన అరెసెస్ కు 4500 పైగా శాఖలు, ఇతర హిందూ సంస్థలు అన్నిటికీ కలిపి 75 వరకు శాఖలున్నా అవేవీ బిజెపికి ఇంతవరకు మైలేజీ ఇప్పించలేకపోయాయి.  గతములో బిజెపి కూడా తన ప్రభావము చూపటానికి ప్రయత్నించక పోవటముతో హిందువులు ముస్లిములు యు.డి.ఎఫ్ కు ఓటు చెస్తూ వస్తున్నాయి. దళితులు క్రిస్టియన్లు అందరు ఎల్.డి.ఎఫ్ కు ఓట్లువేస్తూ వస్తున్నాయి.  సంకీర్ణ ప్రభుత్వాలు కూడా 2 - 3% మార్జిన్ల తేడాతో అధికారం కొనసాగిస్తున్నాయి. 2.56 కోట్ల ఓటర్స్ ఉన్న కేరళలో 55% హిందూ ఓటర్లున్న వారినిఐఖ్యపథంలో నడిపించటానికి బిజెపి కేరళ రధసారధి ఓ. రాజశేఖరన్ వ్యూహంత్మకంగా కొత్తగా పురుడు పోసుకున్న అత్యంత బలమైన వెనుకబడ్డ ఏజ్హవ కులాలనికి చెందిన భారత్ ధర్మ జన సేన (బి.డి.జె.ఎస్) తో బిజెపి పొత్తు పెట్టుకొంది.


నజీమ్ జైదీ


బి.డి.జె.ఎస్ నాయకుడు తుషార్ వెళ్ళపళ్ళి, బి.జె.పి నాయకుడు రాజశేఖరన్ కలసి ఎన్నికల గోదాలో ఇప్పటివరకు స్వల్ప మార్గిన్ తేడాతో అధికారంలోకి ఒకదాని తరువాత మరొకటి వస్తున్న “ద్విదృవ” రాజకీయం లోకి బిజెపి మూడవపక్షంగా ప్రవేశిస్తుందని తమది అభివృద్ది-సామాజిక న్యాయం సాధించే దిశలో పయనించే కలయిక అని ఇరువురు నాయకులు సమ్యుక్తంగా ప్రకటించారు.  ఇప్పుడు బిజెపి ప్రవేశంతో 2.56 కొట్ల ఓటర్లున్న కేరళలో త్రిముఖ పోరాటము ఉంటుందని అర్ధమౌతుంది.  సిఎం ఊమన్ చాంది, కొంత వరకు మంచిపేరున్న పాలకుడే. 46 సంవత్సరాలుగా నిరంత రాయంగా గెలుస్తూనే ఉన్న గొప్పనాయకుడే గాని కాని ఈమధ్య అవినీతి ఉచ్చులో చిక్కు కున్నాడు.

ఈవీఎం


తమిళనాడు, పశ్చిమ-బెంగాల్ రెండింటిలోనూ బిజెపి కి స్థానం లేక పోయినా, ఇప్పటివరకూ బిజెపి ఆనుపానులులేని కెరళలో బిజెపి ఆశాజనకంగానే అడుగులు వేస్తుందని చెప్పవచ్చు.  పేరున్న సినిమా స్టార్ సురేష్ గోపి బిజెపి తరపున ఎన్నికలో పోటీ చేయటానికి సముఖంగా లేకున్నా, బిజెపి కి స్టార్ కాంపెయినర్ గా పనిచేయటానికి ముందుకొస్తున్నట్లు, బిజెపి నుండి గతములో వెళ్ళిపోయిన ప్రముఖ నాయకుడు పి పి ముకుందన్ బిజెపి లోకి తిరిగి రావటానికి సిద్ద పడుతున్నట్లు వార్తలొస్తున్న ఈ ఏన్నికలు బిజెపికి కెరళలో శుభశకునాలే. కేరళలో బిజెపి గెలుపోటము లెలాఉన్నా వారి ప్రయత్నం “ఎన్.డి.ఏ” గా రూపు దిద్దుకోనుంది. ఇదొక అభి నందించదగిన సందర్భమని కెరళ ప్రజలు విశ్వసిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: