ప్రపంచ దేశంలో ఎక్కడ లేని సాంప్రదాయాలు..కట్టుబాట్లు మన భారత దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా మహిళల సాంప్రదాయాల పట్ల విదేశీయులు బాగా ఆకర్షితులవుతారు. ఇక్కడ సాంప్రదాయాలను నేర్చుకోవడానికి ఉత్సాహ పడుతుంటారు..అంతే కాదు భారత దేశంలో మహిళలకు ఉన్నత స్థానం కల్పించబడింది. అంతే కాదు ఇప్పుడు మహిళలకు అన్నింటిలోనూ సమానావకాశాలు కల్పిస్తున్నారు..అది రాజకీయాలే కావచ్చు..ఉద్యోగాలే కావచ్చు..చిత్ర పరిశ్రమలే కావచ్చు. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు భారత దేశంలో మహిళలను పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య లైంగిక వేదింపులు.    నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.

నిర్భయ అత్యాచారా నింధితులు


ప్ర‌తీరోజూ  స్త్రీలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఇలాంటి వరస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విష‌య‌మే మ‌రోసారి ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ రివ్యూ’ అధ్యయనంలో వెల్ల‌డైంది. ఢిల్లీలో ఏడాదిలో ‘40 శాతం’ మహిళలపై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయ‌ని అధ్య‌యనంలో తేలింది. ముఖ్యంగా సెల్ ఫోన్ సౌకర్యం వచ్చిన తర్వాత అశ్లీల చిత్రాల ప్రభావం యువతపై పడటం దీంతో అనాగరికులైన కొంత మంది మహిళలను ఆటవస్తువుల్లా చూడటం..అత్యాచారాలు, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు యువకులు అమ్మాయిలను, మహిళలను సామూహికంగా అత్యాచారాలు చేయడం వాటిని వీడియోల్లో షూట్ చేసి ఫోర్న్ సైట్లలో పెట్టడం లాంటివి చేస్తున్నారు.

మహిళలపై అత్యాచారాలు ఆపమని నిరసనలు


నగరంలోని బస్సులు, పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లోనే గత సంవత్సర కాలంలో ‘40 శాతం మంది’ మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని అధ్య‌యనం తెలిపింది. ప్రతిరోజు భారత దేశంలో ఎక్కడో అక్కడ మహిళలపై చివరకు చిన్నారులపై కూడా అత్యాచారాలు చేస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. దీంతో మంది మ‌హిళ‌లు వేధింపుల భ‌యంతో న‌లుగురిలోకి వెళ్ల‌డ‌మే మానేశార‌ని చెప్పింది. మ‌రికొంద‌రు మ‌హిళ‌లు తమ ఉద్యోగాలు వదిలేశార‌ని నివేదిక పేర్కొంది. ప్రపంచమంతటా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: