పెళ్లయిన దంపతులు కొంత కాలం వరకు ప్రశాంతంగా సంసార సుఖాన్ని అనుభవించాలనుకుంటారు..అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల స్గ్రీ గర్భం దాల్చే పరిస్థితి వస్తుంది..దీనికోసం  ప్రస్తుతం పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించాలంటే ఉన్న మార్గాలు రెండే. శాశ్వతంగా అయితే వాసెక్టమీ చేయించుకోవడం, తాత్కాలికంగా అయితే కండోమ్‌లు వాడటం. అయితే, కండోమ్‌లు వాడుతున్నా కూడా 18 శాతం కేసుల్లో వాళ్ల భాగస్వాములు గర్భం దాలుస్తున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. అంతే కాదు భారత దేశంలో కండోమ్స్ వాడకం కూడా ఎక్కువే ఉండటం..దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు పురుషులకు శుభవార్త..ఏడాది పాటు కండోమ్‌లు వాడక్కర్లేకుండా వాసాజెల్ అనే ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా  శాస్త్రవేత్తలు ఇలాంటి పరిశోధనలు కుందేళ్లపై, కోతులపై చేస్తూంటారు..అయితే వాసాజెల్ ఇంజెక్షన్‌ను మగ కుందేళ్లకు ఇచ్చినపుడు ఏడాది పాటు వాటి వల్ల సంతానం కలగలేదు. తాము అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలే కనిపించాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇలినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డోనాల్డ్ వాలర్ తెలిపారు.


12 కుందేళ్లకు వృషణాల నుంచి వీర్యం వెళ్లే మార్గంలో ఈ జెల్ ఇంజెక్ట్ చేశారు. వాటిలో 11 కుందేళ్లకు సెమెన్‌లో అసలు వీర్యకణాలు లేవని తేలింది. మిగిలిన ఒక్కదానికి కూడా అత్యంత తక్కువ సంఖ్యలోనే వీర్యకణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. భవిష్యత్ లో దీనిపై మరింత ప్రయోగాలు చేసి పురుషులకు కండోమ్స్ అవస్థలు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: