భారత దేశం రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పాలన  నుంచి ఎంతో మంది త్యాగదనులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకు వచ్చారు. ఈ పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్దతి..మహాత్మాగాంధీ అహింస పద్దతులు పాటిస్తే..భగత్ సింగ్,అల్లూరి సీతారామ రాజు మరో పద్దతి..ఇదే తరహాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్   ఓ సైన్యాన్నే ఏర్పాటు చేసి బ్రిటీష్ వాళ్లపై యుద్దం ప్రకటించారు. అయితే ఆయన పై బ్రిటీష్ వారు ఎన్నో కేసులు నమోదు చేశారు..అంతే కాదు నేతాజీని మట్టు పెట్టడానికి ఎన్నో కుట్రలు కూడా పన్నారు. అయితే 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయారని వార్తలు వచ్చాయి.  దీనిపై ఎన్నివిచారణలు జరిగినా, ఎన్నికమిటీలు వేసినా, మరెన్ని నివేదికలు బహిర్గతం చేసినా ఇప్పటికీ అంతుపట్టని ఓ రహస్యం.

అజాద్ హిందూ ఫౌజ్ తో నేతాజీ సుభాష్ చంద్రబోస్


ఇక కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు చంద్రబోస్ గురించి వివరాలు ఏమీ బయటకు రాలేదు..ఈ మద్య నేతాజీకి సంబంధించిన జీవిత చరిత్ర..రహస్య పత్రాల గురించి అన్నీ వెలుగులోకి తీసుకు వచ్చంది మోడీ ప్రభుత్వం. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నా.. తాజాగా బయటపెట్టిన ఫైళ్లు మాత్రం ఆ విషయంపై ఓ స్పష్టతను ఇవ్వలేక తిరిగి పాత ప్రశ్ననే మిగిల్చాయి. ఆయన మరణంపై ఇప్పటి వరకు పూర్తి స్పష్టత రాలేదు. ఆ విమాన ప్రమాదం నుంచి నేతాజీ బతికి బయటపడ్డారని అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 1992నాటి ఒక ఐదు పేజీల నోట్ లో సుభాష్ బతికే ఉన్నట్లుగా వెల్లడించాయి. అలా వెల్లడించిన నోట్ పై ఎలాంటి పేరుగానీ, తేదిగానీ లేదు.

మహాత్మాగాంధీతో సుభాష్ చంద్రబోస్


నాటి బెంగాల్ గవర్నర్ ఆర్జీ కేసీ కార్యాలయంలో విధులు నిర్వహించే పీసీ ఖర్ అనే ఉద్యోగి చెప్పిన ప్రకారం నేతాజీకి చెందిన మూడు పత్రికా కథనాలను గవర్నర్ కార్యాలయం పర్యవేక్షణ సిబ్బంది స్వీకరించింది.  ఆ కథనం ప్రకారం థనంలో   భారత దేశ స్వాతంత్ర్యం కోసం నా గుండె రగులుతోంది. నేతాజీకి ముస్సోలిని, స్టాలిన్ ఇష్టం అని, అంతేకాకుండా నేతాజీ మంచి భోజన ప్రియుడని పేర్కొంది. నేతాజీ గొప్ప హిందుత్వ వాదని కూడా నాటి వార్త కథనాలు వెల్లడయ్యాయి. అహింసతో స్వాతంత్ర్యం రానట్లయితే మనం రెండేళ్లలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిందే'  నేతాజీ చెప్పినట్లు ఉండగా నేతాజీ మహాత్మాగాంధీ పట్ల గౌరవంతో ఉండేవారని కూడా చెప్పింది. ఏది ఏమైనా 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోకపోయి ఉండవచ్చుననే వాదనలు మరోసారి వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: