నెలలూ సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండే సైనికులు కొందరు శాడిస్టులుగా మారుతుంటారు. తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ శాడిజాన్ని వారు ప్రదర్శిస్తుంటారు. అగ్రరాజ్యాల సైనికులు వేరే దేశాల్లో ఇలాంటి లైంగిక శాడిజం ప్రదర్శించిన దాఖలాలు అనేకం గతంలో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఖైదీలపై తమ పశుప్రతాపం చూపుతుంటారు. 

తాజాగా ఓ ఆఫ్రికన్ దేశంలో ఫ్రాన్స్ సైన్యం ఇంతకంటే దారుణంగా వ్యవహరించిందని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ దేశంలో శాంతిని కాపాడతామని వెళ్లిన ఫ్రెంచ్ సైనికులు అక్కడి స్థానికుల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని దారుణమైన లైంగిక నేరాలకు పాల్పడ్డారట. కొందరు మహిళలతోనేతే ఏకంగా శునకాలతోనే బలవంతంగా సెక్స్ చేయించినట్టు ఆరోపణలు రావడం నిజంగా దారుణమే. 

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి మహిళలు, బాలికలు ఈ లైంగిక అకృత్యాల కోసం ఎంచుకునేవారట ఫ్రెంచ్ సైనికులు. అంతేకాదు తమ లైంగిక శాడిజం తీర్చుకునేందుకు అమాయకులైన ఆఫ్రికల్ మహిళలు, బాలికలకు వారు డబ్బు ఎర చూపేవారట. దారుణంగా కుక్కలతోనూ సెక్స్ చేయించి.. వారికి కొంత సొమ్ము ముట్టజెప్పేవారట.

ఫ్రెంచ్ సైన్యంపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఓ మానవ హక్కుల సంస్థ చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని ఇంకా నిజానిజాలు రుజువు కావాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఫ్రాన్స్ కూడా స్పందించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేస్తున్న ఆ దేశం.. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మాత్రం తమ సైనికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: