వెనిజ్యులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. 56 ఏళ్ల ప్రజానాయకుడు చావెజ్‌ గత మూడు వారాలుగా ఎవరికీ కనిపించడం లేదు. క్యూబాలో కేన్సర్‌ వ్యాధికి సర్జరీ జరిగిన తరువాత ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటోందని, ఆయన పరిస్థితి ఆందోళన కరంగా ఉందని సమాచారం. తుంటి భాగంలో బయటపడని కేన్సర్‌ నివారణ కోసం ఏడాదిన్నరలో నాలుగుసార్లు చావెజ్‌ ఆపరేషన్‌ చేయించుకోవలసి వచ్చింది... నాలుగో ఆపరేషన్‌ తరువాత చావెజ్‌ పరిస్థితి దైన్యంగా మారింది. ఊపిరితిత్తులకు వ్యాధి సోకిన తరువాత చావెజ్‌ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చావెజ్‌ ఆరోగ్యంపై లాటిన్‌ అమెరికా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్న్దాయి. వారికి చావెజ్‌ గత పన్నెండేళ్ళగా అధ్యక్షుడి హోదా లో సహకరించారు. వెనిజులా కు అనేక మంది వచ్చి వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అమితంగా వారిని ఆకర్షించారు. రాజ్యాంగం ప్రకారం చావెజ్‌ జనవరి 10 న ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. చావెజ్‌ కు ఏమయినా జరిగితే నెల రోజుల లోపు ఎన్నికలు జరపవలసి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: