అతిగా క్రికెట్ ఆడటం వల్ల భారత్ విసిగిపోయిందని పాక్‌ మాజీకెప్టెన్‌ జహీర్‌ అబ్బాస్‌ పేర్కొన్నాడు. కోల్‌కతాలోజరిగిన సెకండ్‌వన్‌డే లో భారత్‌ ఓటమిపై ఆయనమాట్లాడుతూ పాకిస్థాన్‌ వన్‌డే ఇంట ర్నేషనల్‌ సీరిస్‌లో భారత్‌పై ఆదిపత్యాన్ని ప్రదర్శించింద న్నారు. .పాక్‌తో జరిగిన మ్యాచ్‌ ఒక నరాలయుద్దం వంటిదిగా ఆయన పేర్కొ న్నారు. ఇటీవల భారత్‌ ఎక్కువగా క్రికెట్‌ ఆడుతుంది, కాని తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతుందన్నారు. ఇక ఇండియా సొంత గడ్డ పై ఆడినందు వల్ల కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనైందని .వాస్తవానికి స్వదేశంలో ఆడటం వల్ల అదనపు వత్తిడి కలుగుతుందన్నారు. ఇక ఇండియా కెప్టెన్‌ ధోని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నా, తాను ధోని కి మద్దతుగా ఉంటున్నానన్నాడు. మొత్తానికి భారత క్రికెట్ జట్టుకు అన్నిటికన్నా పెద్ద శత్రువు విపరీతంగా విరామం లేకుండా ఆడటమేనని అందరూ నెత్తి నోరు బాదుకుంటున్నా భారత క్రికెట్ బోర్డు మాత్రం బంగారు బాతులకు విశ్రాంతి ఇవ్వట్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: