దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశద్రోహులతో పోరాటం చేసిన గొప్ప అధికారి ఎన్ఐఏ అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మాద్ (44) చికిత్స పొందుతూ మృతి చెందింది. గత రెండు వారాల క్రితం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ పై ఇద్దరు దుండగులు కారులో కాల్పులు జరిపిన సంఘటనలో  మొహమ్మద్ తంజిల్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు..ఈ కాల్పుల్లో ఆయన భార్యకు  కూడా కొన్ని బుల్లెట్లు తగలడంతో ఆమెను హుటాహుటిన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మొహమ్మద్ తంజిల్ అహ్మద్ నివాళులర్పిస్తున్న దృశ్యం


మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మద్ (44) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూరులో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్‌ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

దుండగుల కాల్పుల్లో మృతి చెందిన ఎన్ఐఎ అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్


ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం 11 గంటలకు మరణించారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. అయితే దుండగులు వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారి దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: