మనిషి జీవితంలో తీరని కష్టాలు వస్తే..ముందుగా ఆలోచనలోకి వచ్చేది ఆత్మహత్య. ఇది వారి చివరి మజిలీ అనుకుంటారు..అయితే ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దని మనోధైర్యం గురించి టీవీ, సోషల్ మాద్యమాల ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినా..ఆత్మహత్య చేసుకునే వారి మనసు మాత్రం మారడం లేదు.  బాలరాజు అనే హోంగార్డ్ మహంకాళి టెంపుల్ ఎదురుగా జనాలు తిరుగుతుండగానే కూల్ డ్రింక్ కొనుక్కొని అందులో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

అయితే బాలరాజు ఆత్మహత్య చేసుకునే దృశ్యాలు  అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగు చూడడమే కాకుండా చర్చనీయాంశమైంది. అయితే సీసీ టీవీ ఫుటేజ్ లో బాలరాజు అక్కడ కాసేపు అటూఇటూ తిరుగుతూ ఉండగా, ఓ మహిళ అక్కడకు వచ్చి అతడిని కలిసి వెళ్ళింది.  తర్వాత బాలరాజు ఓ కూల్ డ్రింక్ తెచ్చుకుని అందులో విషం కలుపుకొని అందరూ చూస్తుండగానే తాగి అక్కడే చనిపోయాడు.

ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు బాలరాజు


ఒక్కసారే ఓ వ్యక్తి కుప్పకూలిపోవడంతో అందరూ వచ్చి చూశారు..అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని చనిపోయింది బాలరాజు అనే హోంగార్డ్ తెలుసుకున్నారు. అయితే అక్కడకు వచ్చిన మహిళ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బాలరాజు హోంగార్డ్స్ సంక్షేమం కోసం ఒకప్పుడు ఎంతో కృషి చేశారని, గతంలో హోంగార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: