సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత పత్రిక అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేసే పత్రికకు సర్కారు తీరును ఎండగట్టే అవకాశం చాలా ఉంటుంది. వాస్తవానికి ఆ పత్రిక తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించుకునేందుకు అంతకు మించిన అవకాశం దొరకదు. కానీ ఎందుకో ఏమో ఇటీవల సాక్షి పత్రిక ఏపీ సర్కారును ఎండగట్టడంలో అంత దూకుడు ప్రదర్శిస్తున్నట్టు కనిపించడం లేదు. 

తాజాగా చంద్రబాబు సర్కారును ఎండగట్టే అవకాశం వచ్చినా సాక్షి పత్రిక దాన్ని ఉపయోగించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై, చంద్రబాబు పాలనపై జనం ఏమనుకుంటున్నారన్న అంశంపై సీఎంఎస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అనే ఈ సంస్థకు మీడియా వర్గాల్లో మంచి విశ్వసనీయత ఉంది. 

బాబును ఏకేసే గోల్డెన్ ఛాన్స్.. "సాక్షి" మిస్ చేసుకుందా...!?



ఈ సర్వేలో చంద్రబాబు పాలనకు సంబంధించి ఎన్నో నెగిటివ్ అంశాలు వెలుగు చూశాయి. చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నాడు.. సీఎంగా ఆయన ఓకే అనే అంశాలు తప్పించి మిగిలిన అన్ని అంశాల్లోనూ దాదాపుగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు కష్టపడినా తమకు మాత్రం ఫలితం అందడం లేదని జనం భావిస్తున్నారట. 

యువత, రైతులు చంద్రబాబు సర్కారుపై తీవ్ర కోపంతో ఉన్నారట. ఆంధ్రా కంటే తెలంగాణలో పాలన బావుందని జనం ఫీలయ్యారట. చంద్రబాబు సర్కారు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న అభిప్రాయం ఎక్కువగా ఉందట. సర్కారును ఎండగట్టే ఇంత మంచి వార్తను సాక్షి పత్రిక ఏ మాత్రం హైలెట్ చేయలేకపోయింది. 

సర్వే ఫలితాలు అన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండి.. సీఎంగా ఆయనే కావాలన్న ఒక్క పాయింట్ నే హైలెట్ చేస్తూ పచ్చ మీడియా కథనాలు వార్చేస్తే.. సాక్షి మాత్రం తెల్లమొఖం వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: